బట్లర్ వీర బాదుడు | Jos Buttler Blitz Helps Eoin Morgan's England Beat Sri Lanka In One-Off T20I | Sakshi
Sakshi News home page

బట్లర్ వీర బాదుడు

Published Wed, Jul 6 2016 4:51 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

బట్లర్ వీర బాదుడు

బట్లర్ వీర బాదుడు

సౌతాంఫ్టన్: జాస్ బట్లర్ వీర విహారంతో శ్రీలంకతో జరిగిన ఏకైన టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. గుణతిలక(26) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జొర్డాన్, డాసన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. ప్లంకెట్ 2 వికెట్లు తీశాడు.

141 పరుగుల టార్గెట్ ను 15 బంతులు మిగులుండగానే ఇంగ్లీషు టీమ్ ఛేదించింది. 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఓపెనర్ జాస్ బట్లర్ వీర బాదుడు బాదాడు. అజేయ అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 49 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు సాధించాడు. మోర్గాన్ 47, విన్స్ 16 పరుగులు చేశారు. రాయ్ డకౌటయ్యాడు. లంక ఆటగాళ్లలో ఏడుగురు బౌలింగ్ చేశారు. మాథ్యూస్ 2 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో అంతకుముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement