న్యూజిలాండ్‌ ఘన విజయం | New Zealand Won The Test Match Against England | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ ఘన విజయం

Published Tue, Nov 26 2019 3:03 AM | Last Updated on Tue, Nov 26 2019 3:03 AM

New Zealand Won The Test Match Against England - Sakshi

మౌంట్‌ మాంగని (న్యూజిలాండ్‌): ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన న్యూజిలాండ్‌ తొలి టెస్టులో ఇన్నింగ్స్, 65 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా డబుల్‌ సెంచరీ హీరో వాట్లింగ్‌ నిలిచాడు. చివరి రోజు తన బౌలింగ్‌తో వాగ్నర్‌ ( 5/44) ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేయడంలో ముఖ్య భూమిక పోషించాడు. ‘డ్రా’ చేసుకోవాలంటే రోజు మొత్తం ఆడాల్సిన ఇంగ్లండ్‌... ఓవర్‌నైట్‌ స్కోర్‌ 55/3తో చివరి రోజు ఆటను ఆరంభించింది.

వాగ్నర్‌ ధాటికి నిలువలేకపోయిన ఇంగ్లండ్‌ 96.2 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. రూట్‌ (11), స్టోక్స్‌ (28), బట్లర్‌ (0) నిరాశ పరిచారు. అయితే స్యామ్‌ కరన్‌ (59 బంతుల్లో 29 నాటౌట్‌; 5 ఫోర్లు), జోఫ్రా ఆర్చర్‌ (50 బంతుల్లో 30; 5 ఫోర్లు) న్యూజిలాండ్‌ విజయాన్ని కాసేపు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరు తొమ్మిదో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఈ సమయంలో బంతిని అందుకున్న వాగ్నర్‌ వరుస బంతుల్లో ఆర్చర్, బ్రాడ్‌లను అవుట్‌ చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ మ్యాచ్‌లో కొందరు ప్రేక్షకులు తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారని ఇంగ్లండ్‌ బౌలర్‌ ఆర్చర్‌ ఆరోపించగా... ఈ సంఘటనపై అతనికి క్షమాపణలు చెబుతామని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement