పాక్‌ను గెలిపించిన రిజ్వాన్‌ | Pakistan Beat South Africa in 1st T20 | Sakshi
Sakshi News home page

పాక్‌ను గెలిపించిన రిజ్వాన్‌

Published Sun, Apr 11 2021 5:42 AM | Last Updated on Sun, Apr 11 2021 5:42 AM

Pakistan Beat South Africa in 1st T20 - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్‌ రిజ్వాన్‌ (50 బంతుల్లో 74 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచి పాక్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 189 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో ఫహీమ్‌ అష్రఫ్‌ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్‌) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.   అంతకుముందు దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 188 పరుగులు సాధించింది. మార్క్‌రమ్‌ (51; 8 ఫోర్లు, సిక్స్‌), క్లాసెన్‌ (50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. రెండో టి20 మ్యాచ్‌ సోమవారం జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement