CSK And RCB In Top 10 Popular Teams: ఐపీఎల్ జట్లైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)లు ప్రపంచ స్థాయిలో అరుదైన ఘనతను సాధించాయి. గతేడాది విశ్వవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధిక ఎంగేజ్మెంట్‌లు (లైకులు, షేర్స్, కామెంట్స్ విషయంలో) కలిగిన భారత క్రీడా క్లబ్‌లుగా రికార్డు నెలకొల్పాయి. ఆర్సీబీ 820 మిలియన్ల ఎంగేజ్మెంట్లతో 8వ స్థానంలో నిలవగా.. సీఎస్కే 752 మిలియన్ల ఎంగేజ్మెంట్లతో 9వ ప్లేస్‌లో ఉంది.
ఈ జాబితాలో ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ 2.6 బిలియన్ల ఎంగేజ్మెంట్లతో ప్రథమ స్థానంలో నిలువగా, ఆ తర్వాతి స్థానాల్లో బార్సిలోనా (2.3 బిలియన్స్), రియల్ మాడ్రిడ్ (1.3 బిలియన్స్), పారిస్ సెయింట్ జర్మైన్ (1.2 బిలియన్స్), చెల్సీ (1.2 బిలియన్స్), లివర్ పూల్ (1.1 బిలియన్స్), గలాటాసరే (857 మిలియన్స్) వంటి ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్‌లు ఉన్నాయి.
ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ఫుట్ బాల్ క్లబ్‌ల సరసన కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ, ధోని సారధ్యంలోని సీఎస్‌కే జట్లు నిలిచాయి. కాగా, ఐపీఎల్ కొత్త ఫ్రాంఛైజీలైన లక్నో, అహ్మదాబాద్‌ల కోసం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ బిడ్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: IPL 2022: బీసీసీఐ జాక్‌పాట్ కొట్టేసింది.. అదనంగా 130 కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment