
India vs England 5th Test Day 2 Live Updates
రెండో రోజు ముగిసిన ఆట.. 255 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
భారత-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. బుమ్రా (19), కుల్దీప్ (27) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
పెవిలియన్‌కు క్యూ కడుతున్న టీమిండియా ఆటగాళ్లు
టీమిండియా ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. పరుగు వ్యవధిలో భారత జట్టు 3 వికెట్లు కోల్పోయింది. 428 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ నష్టపోయింది. హార్ట్లీ బౌలింగ్‌లో అశ్విన్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
427 పరుగుల వద్ద టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 101వ ఓవర్‌లో బషీర్ బౌలింగ్‌లో జురెల్ (15), టామ్ హార్ట్లీ వేసిన ఆతర్వాతి ఓవర్‌లో జడేజా (15) ఔటయ్యారు. 101.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 427/7గా ఉంది. అశ్విన్ క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 209 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
92.1 ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
షోయబ్ బషీర్ బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ బౌల్డ్. ఈ అరంగేట్ర టీమిండియా బ్యాటర్ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. స్కోరు: 406-5(93). పడిక్కల్ స్థానంలో ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు.
సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్
అరంగేట్రం ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టీ విరామం తర్వాత తొలి బంతికే ఔటైన సర్ఫరాజ్
టీ విరామం అనంతరం తొలి బంతికే సర్ఫరాజ్ ఖాన్ (56) ఔటయ్యాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 84.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 376/4గా ఉంది. పడిక్కల్‌కు (44) జతగా జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు.
సర్ఫరాజ్ ఖాన్ ఫిప్టీ..
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 55 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 81 ఓవర్లకు భారత్ స్కోర్: 366/3
►76 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (27), పడిక్కల్ (34) పరుగులతో క్రీజులో ఉన్నారు.
68: మూడు వందల పరుగుల మార్కు దాటిన టీమిండియా
సర్ఫరాజ్ ఖాన్ ఏడు, పడిక్కల్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ ఔట్
279 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 110 పరుగులు చేసిన గిల్.. ఆండర్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..
రోహిత్ శర్మ(103) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి అరంగేట్ర ఆటగాడు దేవ్‌దత్త్ పడిక్కల్ వచ్చాడు. 62 ఓవర్లకు భారత స్కోర్: 275/1
గిల్ సూపర్ సెంచరీ..
శుబ్‌మన్ గిల్ సైతం తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 137 బంతుల్లో గిల్ సెంచరీని పూర్తి చేశాడు. లంచ్ విరామానికి టీమిండియా స్కోర్: 264/1. భారత్ ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
రోహిత్ శర్మ సెంచరీ..
ధర్మశాల టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 154 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్‌కు ఇది 12వ టెస్టు సెంచరీ. ఓవరాల్‌గా ఇది 48వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. 58 ఓవర్లకు బారత స్కోర్: 257/1
సెంచరీకి చేరువలో రోహిత్, గిల్..
రోహిత్ శర్మ(90), గిల్(87) సెంచరీకి చేరువయ్యారు. 54 ఓవర్లకు భారత స్కోర్: 241/1. టీమిండియా ప్రస్తుతం 23 పరుగుల ఆధిక్యంలో ఉంది.
శుబ్‌మన్ గిల్ ఫిప్టీ..
టీమిండియా యువ ఆటగాడు మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 52 పరుగులతో గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(75) క్రీజులో ఉన్నాడు. 41 ఓవర్లకు భారత్ స్కోర్: 189/1
►38 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 180 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(72), శుబ్‌మన్ గిల్(47) పరుగులతో ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న టీమిండియా.,.
రెండో రోజు ఆటను టీమిండియా దూకుడుగా ఆరంభించింది. ఇంగ్లండ్ స్పిన్నర్ బషీర్‌ను రోహిత్ శర్మ టార్గెట్ చేశాడు. 33 ఓవర్లు ముగిసే సరికి భారత తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(63), శుబ్‌మన్ గిల్(27) పరుగులతో ఉన్నారు.
ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్‌ను స్పిన్నర్ ప్రారంభించాడు. ప్రస్తుతం టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(52), గిల్(26) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment