స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌తో వెస్టిండీస్ యువ స్పిన్నర్ కెవిన్ సింక్లెయిర్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటి వరకు టీ20ల్లో విండీస్ తరపున 6 మ్యాచ్‌లు ఆడిన సింక్లెయిర్.. 8.33తో ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు.
అదే విధంగా తన లిస్ట్-ఏ కెరీర్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన సింక్లెయిర్ 18 వికెట్లు సాధించాడు. మరో వైపు రోస్టన్ ఛేజ్ గాయం కారణంగా ఈ సీరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో విండీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనుంది. మూడు వన్డేలు కూడా కింగ్‌స్టన్ ఓవల్ వేదికగానే జరగనున్నాయి.
కాగా ప్రస్తుతం విండీస్.. కివీస్‌తో టీ20 సిరీస్‌లో తలపడుతోంది. కింగ్‌స్టన్ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్ 1-0తో అధిక్యంలో ఉంది. కాగా స్వదేశంలో భారత్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను విండీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే.
కివీస్‌తో వన్డే సిరీస్‌కు విండీస్ జట్టు
నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లైర్.
చదవండి: Asia Cup 2022: 'ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వద్దు.. అతడినే రోహిత్ జోడిగా పంపండి'
Comments
Please login to add a commentAdd a comment