cricket retirement
-
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ స్టార్ బౌలర్
ఇంగ్లండ్ మహిళా స్టార్ బౌలర్ అన్య ష్రుబ్సోల్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు శుక్రవారం వెల్లడించింది. ష్రూబ్సోల్ 2009,2017లో ప్రపంచకప్‌లు గెలిచిన ఇంగ్లండ్‌లో జట్టులో భాగమైంది. 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌పై ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇంగ్లండ్ తరపున అన్ని ఫార్మాట్లలో 173 మ్యాచ్‌లు ఆడిన అన్య ష్రుబ్సోల్.. 227 వికెట్లు పడగొట్టింది. ఇక టీ20ల్లో 102 వికెట్లు పడగొట్టిన ఆమె.. టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డును కలిగి ఉంది. ష్రూబ్సోల్ చివరగా మహిళల ప్రపంచ కప్-2022 ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మంట్ ప్రకటించిన ఆమె రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ, షార్లెట్ ఎడ్వర్డ్స్ కప్, ది హండ్రెడ్ వంటి దేశవాళీ టోర్నీలో మాత్రం ఆడనుంది. చదవండి: IPL 2022: ఐపీఎల్లో ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా! -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్ బౌలర్
న్యూజిలాండ్ పేసర్ హమీష్ బెన్నెట్ అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు తన నిర్ణయాన్ని మంగళవారం (ఏప్రిల్ 12) వెల్లడించాడు. బెన్నట్ 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ తరపున 19 వన్డేలు,11 టీ20లు, ఒకఒక టెస్టులో బెన్నెట్ ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లు కలిపి అతడు కేవలం 43 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.అయితే అంతర్జాతీయ స్థాయిలో అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కాగా 2011 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టుకు అతడు ఎంపికయ్యనప్పటికీ.. గాయం కారణంగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. "నాకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే మక్కువ. అయితే నేను నా కెరీర్లో ఈ స్థాయికి చేరుకుంటానికి కలలో కూడా అనుకోలేదు. నా క్రికెట్ కెరీర్ ఓల్డ్ బాయ్స్ తిమారు క్రికెట్ క్లబ్ నుంచి ప్రారంభమైంది. నా కెరీర్ ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన కాంటర్బరీ క్రికెట్,న్యూజిలాండ్ క్రికెట్ ధన్యవాదాలు. ముఖ్యంగా న్యూజిలాండ్ తరపున ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వంగా ఉంది" అని బెన్నెట్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఎస్ఆర్హెచ్ బౌలర్ ఖాతాలో చెత్త రికార్డు.. డేల్ స్టెయిన్ తర్వాత..! -
హైదరాబాద్‌కు భారీ షాక్.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాడు
హైదరాబాద్ మాజీ కెప్టెన్ ద్వారకా రవితేజ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా రవితేజ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. తన 16 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో హైదరాబాద్, మేఘాలయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక రవితేజ భారత అండర్-19 జట్టుకు, భారత్-ఎ జట్టుకు కూడా ఆడాడు. ఈ క్రమంలో భారత అండర్-19 జట్టుకు, భారత్-ఎ జట్టుకు ఆడే అవకాశం కల్పించిన బీసీసీఐకు రవితేజ ధన్యవాదాలు తెలిపాడు. 2006లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున రంజీల్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 84 పరుగులు చేసి అతడు అకట్టుకున్నాడు. ఇక తన కెరీర్లో చివరి మ్యాచ్ ప్రస్తుతం జరుగుతోన్న రంజీట్రోఫీలో గుజరాత్‌తో మేఘాలయ తరఫున ఆడాడు. ఈ మ్యాచ్‌లో 133 పరుగులు సాధించి తన కెరీర్‌కు ముగింపు పలికాడు. మరో వైపు 2008 ఐపీఎల్ తొలి సీజన్లో దక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. ఇక 78 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రవితేజ 4722 పరుగులు సాధించాడు. 85 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన అతడు 2942 పరుగులు చేశాడు. చదవండి: Ind Vs SL 2nd Test - Day 1: ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టెస్టు అప్డేట్స్ -
వికెట్ పడగొట్టాడు.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు!
NZ vs BAN: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం రాస్ టేలర్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో టేలర్ 112 టెస్టుల్లో 44.66 సగటుతో 7,683 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 290. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత టేలర్‌దే. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్ అతడి కేరిర్‌లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ముందు 38 ఏళ్ల టేలర్ తన కెరీర్లో రెండే వికెట్లు (2010లో) తీశాడు. అయితే చివరి టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు కనిపించకపోవడంతో కివీస్ కెప్టెన్ లాథమ్ అతనితో సరదాగా బౌలింగ్ చేయించాడు. తన మూడో బంతికే అతను బంగ్లా చివరి వికెట్ (ఇబాదత్)ను అవుట్ చేసి ఘనంగా ఆటను ముగించడం విశేషం. న్యూజిలాండ్ ఘన విజయం తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో కివీస్ జట్టు ఇన్నింగ్స్, 117 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 395 పరుగుల ఆధిక్యం కోల్పోయి ఫాలోఆన్ ఆడిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (102; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. జేమీసన్‌కు 4, వాగ్నర్‌కు 3 వికెట్లు దక్కాయి. చదవండి: Virat Kohli: శతక్కొట్టి కూతురికి బర్త్ డే గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు.. కానీ..! Gotta love Ross Taylor getting his 3rd Test wicket in his final Test to win the match. pic.twitter.com/8KsjuWMExR — Andrew Donnison (@Donno79) January 11, 2022 -
మురళీ కార్తీక్ గుడ్‌బై
న్యూఢిల్లీ: భారత వెటరన్ స్పిన్నర్ మురళీ కార్తీక్ అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల మురళీ కార్తీక్ 1999-2007 మధ్య కాలంలో 8 టెస్టులు, 37 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 24 వికెట్లు, వన్డేల్లో 37 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కార్తీక్‌కు అద్భుతమైన రికార్డుంది. 203 మ్యాచ్‌లాడి 644 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లీష్ కౌంటీల్లోనూ రాణించాడు. ఐపీఎల్-7లో పంజాబ్ తరపున ఆడిన కార్తీక్.. ఈ ఏడాది చాంపియన్స్ లీగ్‌తో క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిపాడు. -
రిటైర్మెంట్ ఆలోచనే లేదు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో దాని గురించి ఆలోచించడం లేదు కాబట్టి వీడ్కోలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాడు. మొత్తానికి 200వ టెస్టు మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ అవుతాడని వస్తున్న ఊహాగానాలకు మాస్టర్ తెరదించాడు. ‘రిటైర్మెంట్కు తొందరేముంది. నా కెరీర్ మొత్తంలో ఏనాడూ తొందరపడలేదు. ఇలానే ఉన్నా. ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఫార్ములా కూడా అదే’ అని సచిన్ తెలిపాడు. తాను దేవుడ్ని కాదని కేవలం క్రికెటర్ని మాత్రమేనని అన్నాడు. ‘ నేను భగవంతుడ్ని కాను. కేవలం క్రికెట్ ఆడతా. దేవుని ఆశీస్సుల వల్లే నా జీవితంలో ఇదంతా సాధించా. కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు. నేను కూడా తప్పులు చేస్తా. చేయకపోతే ఎప్పుడూ అవుట్ కాను. కాబట్టి నా ఆట వరకు నేను ఆడతా. మ్యాచ్‌కు ముందు కొంత మేరకు సన్నద్ధమవుతా’ అని మాస్టర్ వెల్లడించాడు. ఎన్నో వివాదాలతో ముడిపడి ఉన్న క్రికెట్లో సుదీర్ఘకాలంగా అభిమానుల ఆశలను మోయడంపై స్పందిస్తూ... ‘జీవితాన్ని చాలా సాధారణంగా ఉండేటట్లు చూసుకుంటా. నా స్కూల్ రోజుల నుంచి చాలా తక్కువగా సంబరాలు చేసుకునేవాణ్ని. ఏదైనా సాధిస్తే దేవుడికి మిఠాయి ఆఫర్ చేసేవాణ్ని. ఎలాగూ మ్యాచ్ గురించి ప్రజలు మాట్లాడుకుంటారు కాబట్టి నీవు ముందుకు సాగిపో అని నా సోదరుడు ఎప్పుడూ చెబుతుంటాడు. నాది సమతుల్యమైన జీవితం’ అని ఈ ముంబైకర్ పేర్కొన్నాడు. తన తండ్రి మరణంతో కఠినమైన దశను ఎదుర్కొన్నానని చెప్పాడు. ‘1999లో నా తండ్రిని కోల్పోయాను. ఇప్పటికి చాలా ఏళ్లయింది. సమయం దొరికినప్పుడు పాత జ్ఞాపకాలను రివైండ్ చేసుకుంటే మా తండ్రి గుర్తుకు వస్తారు. కానీ జరిగిన దాన్ని మార్చలేం కదా’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. యువకుడిగా ఉన్నప్పుడు మారుతీ 800 తన కలల కారు అని చెప్పాడు.