మురళీ కార్తీక్ గుడ్‌బై | Murali Kartik retires from cricket | Sakshi
Sakshi News home page

మురళీ కార్తీక్ గుడ్‌బై

Published Sun, Jun 15 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

మురళీ కార్తీక్ గుడ్‌బై

మురళీ కార్తీక్ గుడ్‌బై

 న్యూఢిల్లీ: భారత వెటరన్ స్పిన్నర్ మురళీ కార్తీక్ అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల మురళీ కార్తీక్ 1999-2007 మధ్య కాలంలో 8 టెస్టులు, 37 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
 
  టెస్టుల్లో 24 వికెట్లు, వన్డేల్లో 37 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో  కార్తీక్‌కు అద్భుతమైన రికార్డుంది. 203 మ్యాచ్‌లాడి 644 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లీష్ కౌంటీల్లోనూ రాణించాడు. ఐపీఎల్-7లో పంజాబ్ తరపున ఆడిన కార్తీక్.. ఈ ఏడాది చాంపియన్స్ లీగ్‌తో క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement