
గుప్టిల్
టాప్ ఆర్డర్ రాణించడంతో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 58 పరుగుల (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) తేడాతో విజయం సాధించింది.
నీల్సన్: టాప్ ఆర్డర్ రాణించడంతో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 58 పరుగుల (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 285 పరుగులు చేసింది. గుప్టిల్ (81), టేలర్ (49), రైడర్ (47), విలియమ్సన్ (47) రాణించారు.
బ్రేవో 2, హోల్డర్, బెస్ట్, నరైన్ తలా ఓ వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 33.4 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం రావడంతో మ్యాచ్ సాధ్యపడలేదు. దీంతో డక్‌వర్త్ ప్రకారం ఫలితాన్ని నిర్ణయించారు. సిమన్స్ (43), బ్రేవో (43 నాటౌట్) మెరుగ్గా ఆడగా, ఎడ్వర్డ్స్ (24) ఫర్వాలేదనిపించాడు. మెక్లీంగన్, నాథన్ మెకల్లమ్, విలియమ్సన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. గుప్టిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఐదో వన్డే బుధవారం హామిల్టన్‌లో జరుగుతుంది.
సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 285/6 (గుప్టిల్ 81, రైడర్ 47, రాస్ టేలర్ 49, బ్రేవో 2/35); వెస్టిండీస్ ఇన్నింగ్స్: 134/5 (33.4 ఓవర్లలో) (సిమన్స్ 43, బ్రేవో 43 నాటౌట్).