Ind Vs Aus T20 Series: Rohit Sharma Eyes On Spectacular World Record Check - Sakshi
Sakshi News home page

Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్‌ శర్మ! రెండు భారీ షాట్లు కొడితే..

Published Tue, Sep 20 2022 3:38 PM | Last Updated on Tue, Sep 20 2022 4:38 PM

Ind Vs Aus T20 Series: Rohit Sharma Eyes On Spectacular World Record Check - Sakshi

రోహిత్‌ శర్మ

India Vs Australia T20 Series 2022-  Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20 ఫార్మాట్‌లో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో హిట్‌మ్యాన్‌ ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్‌లో 3620 పరుగులు సాధించాడు. నాలుగు శతకాలు.. 28 హాఫ్‌ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక టీ20లలో హిట్‌మ్యాన్‌ అత్యధిక స్కోరు 118. అదే విధంగా ఈ ఫార్మాట్‌లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో రోహిత్‌ శర్మ ఇప్పటి వరకు 323 ఫోర్లు, 171 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ఆరంభం నేపథ్యంలో టీమిండియా సారథి అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు.

రెండు సిక్సర్లు కొట్టాడంటే!
మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబరు 20) భారత్‌- ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మొదలుకానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఒక్క సిక్స్‌ కొడితే.. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ రికార్డును సరిచేస్తాడు. రెండు సిక్సర్లు గనుక బాదితే గప్టిల్‌ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

ఇక గప్టిల్‌ ఇప్పటి వరకు 121 అంతర్జాతీయ టీ20లు ఆడి 172 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్‌ శర్మ 171 సిక్సర్లతో అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. వీరి తర్వాత.. వెస్టిండీస్‌ బ్యాటర్‌ క్రిస్‌గేల్‌ 124, ఇంగ్లండ్‌ మాజీ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ 120, ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 117 సిక్సర్లతో టాప్‌-5లో కొనసాగుతున్నారు. 

చదవండి: T20 WC 2022: పంత్‌ ఆ స్థానానికి సరిపోడు! అతడిని ఆడించకపోవడమే మంచిది: భారత మాజీ ఓపెనర్‌
CSA 2022 Auction- Kavya Maran: ఆ వేలంలో హైలెట్‌గా కావ్య.. ఎంఐతో పోటీపడి! యువ హిట్టర్‌ కోసం భారీ ధర!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement