
Martin Guptill Injury: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చేతిలో ఓటమి చెందిన న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ భారత్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సూపర్-12 రౌండ్‌లో భాగంగా మంగళవారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో గప్టిల్ గాయపడ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన హరీస్ రవూఫ్.. రెండో బంతికే గప్టిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
అయితే రవూఫ్ వేసిన బంతి నేరుగా గప్టిల్ కాలికి తగిలి వికెట్లను తాకింది. ఈ క్రమంలో గుప్టిల్ బొటనవేలుకు గాయమైంది. దీంతో అతడు ఫీల్డింగ్‌కు రాలేదు. దీనిపై స్పందించిన న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. మ్యాచ్‌లో గప్టిల్ బోటనవేలుకు గాయమైంది. ఈ క్రమంలో గప్టిల్‌ను స్కానింగ్‌కు పంపినట్లు అతడు తెలిపాడు. గప్టిల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని స్టెడ్ పేర్కొన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ (27), డేవన్ కాన్వే (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాక్ పేసర్ హారిస్ రవూఫ్ నాలుగు వికెట్లు పడగొట్టి కివీస్ ఇన్నింగ్స్‌ను కుదేల్ చేశాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌కు శుభారంభం లభించలేదు.
ఓపెనర్లు... కెప్టెన్ బాబర్ ఆజమ్ (9), ఫఖర్ జమాన్ (11) సహా హఫీజ్ (11) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. తర్వాత రిజ్వాన్ (34 బంతుల్లో 33; 5 ఫోర్లు) కూడా పెవిలియన్ చేరడంతో.. పాక్ ఒక దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది . చివర్లో ఆసిఫ్ అలీ 12 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో (27) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో పాక్ విజయం సాధించింది.
చదవండి: Shoaib Malik: సెలక్టర్ల నిర్ణయం సరైందేనని నిరూపించాడు: జహీర్ ఖాన్