Ind Vs Nz 2nd T20I: Martin Guptill Beats Kohli Creates Most Runs In T20I - Sakshi
Sakshi News home page

Martin Guptill: కోహ్లి రికార్డు బద్దలు .. టి20 చరిత్రలో తొలి బ్యాటర్‌గా గప్టిల్‌

Published Fri, Nov 19 2021 8:01 PM | Last Updated on Fri, Nov 19 2021 8:49 PM

IND vs NZ: Martin Guptill Breaks Virat Kohli Record Most Runs T20Is - Sakshi

Martin Guptill Breaks Kohli Record Most Runs In T20Is.. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ టి20 క్రికెట్‌ చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గప్టిల్‌ అగ్రస్థానంలో నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు  ఈ ఘనత సాధించాడు. ఇక మ్యాచ్‌లో 31 పరుగులు చేసిన ఔటైన గప్టిల్‌ ఇప్పటివరకు కివీస్‌ తరపున 111 మ్యాచ్‌ల్లో 3246 పరుగులు సాధించాడు.

అత్యధిక పరుగుల జాబితాలో టాప్‌లో ఉన్న కోహ్లిని దాటి మార్టిన్‌ తొలి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న విరాట్‌ కోహ్లి 95 మ్యాచ్‌ల్లో 3227 పరుగులు చేశాడు. ఇక రోహిత్‌ శర్మ 118 మ్యాచ్‌ల్లో 3086 పరుగులతో మూడో  స్థానంలో.. ఆస్ట్రేలియా నుంచి కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 83 మ్యాచ్‌ల్లో 2608 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

చదవండి: Harshal Patel: 30 ఏళ్ల 361 రోజులు.. హర్షల్‌ పటేల్‌ కొత్త చరిత్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement