హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరితే అంతకన్నా దురదృష్టం ఉండదు. బ్యాట్స్‌మన్ స్వీయ తప్పిదం కారణంగానే వికెట్‌ను హిట్ వికెట్‌గా సమర్పించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ హిట్ వికెట్‌గా నిష్క్రమించాడు. న్యూజిలాండ్ లక్ష్య ఛేదనలో భాగంగా ఫెహ్లుక్వాయో వేసిన 15 ఓవర్ చివరి బంతికి గప్టిల్ అదుపు తప్పి కాలితో వికెట్లను పడగొట్టడంతో హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. పుల్‌షాట్ ఆడబోయిన గప్టిల్ బ్యాలెన్స్ చేసుకోవడంలో విఫలం కావడంతో వికెట్లను తాకాడు.