గప్టిల్కు ఉద్వాసన | Guptill dropped from New Zealand squad for Pakistan tests | Sakshi
Sakshi News home page

గప్టిల్కు ఉద్వాసన

Published Thu, Nov 10 2016 10:56 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

గప్టిల్కు ఉద్వాసన

గప్టిల్కు ఉద్వాసన

వెల్లింగ్టన్:గత కొంతకాలంగా పేలవమైన కొనసాగిస్తున్న న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్కు ఉద్వాసన పలికారు. పాకిస్తాన్తో స్వదేశంలో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్కు గప్టిల్ను న్యూజిలాండ్ సెలక్టర్లు పక్కను పెట్టేశారు.ఈ మేరకు 13మంది సభ్యులతో కూడిన న్యూజిలాండ్ టెస్టు జట్టులో గప్టిల్ తో పాటు, స్పిన్నర్లు, ఇష్ సోథీ, జీతన్ పటేల్, ఫాస్ట్ బౌలర్ డాగ్ బ్రాస్ వెల్, వికెట్ కీపర్ ల్యూక్ రోంచీలకు స్థానం దక్కలేదు.

 

న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాడైన గప్టిల్ ను పక్కకు పెట్టడానికి ప్రధాన కారణం అతని నిలకడలేమి. భారత్ జరిగిన మూడు టెస్టుల సిరీస్లో గప్టిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ సిరీస్లో ఆరు ఇన్నింగ్స్ ల్లో 21,0, 13, 24, 72, 29 పరుగులు నమోదు చేశాడు. మొత్తంగా 159 పరుగులు చేసి 26.0 సగటుతో నిలిచాడు.

మరోవైపు ఆక్లాండ్ ఆటగాడు జీత్ రీవల్, కోలిన్ డీ గ్రాండ్ హోమ్మీలకు తొలిసారి టెస్టుల్లో చోటు కల్పించారు.ఇదిలా ఉండగా, మరోసారి టాడ్ ఆస్టల్కు టెస్టు జట్టులోకి స్థానం దక్కించుకున్నాడు. స్వతహాగా బ్యాటింగ్ ఆల్ రౌండర్ అయిన ఆస్టల్ను స్పిన్ ఆప్షన్గా ఉపయోగించుకుంటామని న్యూజిలాండ్ సెలక్టర్ గావిన్ లార్సెన్ పేర్కొన్నాడు.గప్టిల్ స్థానంలో జీత్ రీవల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని లార్సెన్ తెలిపాడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement