లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ-2024 విజేతగా సదరన్ సూపర్ స్టార్స్ నిలిచింది. శ్రీనగర్ వేదికగా కోణార్క్ సూర్యస్, సదరన్ సూపర్ స్టార్స్ మధ్య జరిగిన ఫైనల్ పోరు సినిమా థ్రిల్లర్‌ను తలపించింది. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌లో తేలింది.
కోణార్క్ సూర్యస్‌పై సూపర్ ఓవర్‌లో సదరన్ జట్టు విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
సూపర్ స్టార్స్ బ్యాటర్లలో జింబాబ్వే మాజీ కెప్టెన్ హ్యామిల్టన్ మసకద్జ(58 బంతుల్లో 83; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోణార్క్ సూర్యాస్ ఒడిశా బౌలర్లలో మునవీర నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఇర్ఫాన్ పఠాన్, దివేశ్ పఠానియా తలో వికెట్ సాధించారు.
యూసఫ్ విరోచిత పోరాటం..
అనంతరం లక్ష్యచేధనలో కోణార్క్ సూర్యస్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.కాగా 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సూర్యస్ జట్టును యూసఫ్ పఠాన్ తన విరోచిత ఇన్నింగ్స్‌తో పోటీలో ఉంచాడు.
ఈ మ్యాచ్‌లో పఠాన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. ఇక సూపర్ ఓవర్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కొణార్క్ జట్టు 13 పరుగులు చేసింది. ఆ తర్వాత సదరన్ జట్టు కేవలం 4 బంతుల్లోనే టార్గెట్‌ను అందుకుంది. సదరన్ స్టార్ బ్యాటర్ గుప్టిల్ వరుసగా రెండు సిక్స్‌లు బాది తమ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.
చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ సంచలన నిర్ణయం.. క్లాసెన్‌కు రూ.23 కోట్లు!
Maturity is when you realize Yusuf Pathan can still make into main Indian side.
Gem of a knock in the final, 85 of 38 balls 🥶pic.twitter.com/SJmRWLVjUI— Sujeet Suman (@sujeetsuman1991) October 16, 2024
Comments
Please login to add a commentAdd a comment