వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. సోమవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో యూసఫ్ పఠాన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 48 బంతులు ఎదుర్కొన్న యూసఫ్ పఠాన్ 78 పరుగులు చేశాడు.
కానీ ఆఖరిలో ఔట్ కావడంతో జట్టును గెలిపించలేకపోయాడు. యూసఫ్‌తో పాటు అంబటి రాయడు(26) పరుగులతో పర్వాలేదన్పించాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్(19) మరోసారి ఫెయిల్ అయ్యాడు.
ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడిల్, కౌల్టర్‌నైల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. లాగ్లిన్, క్రిస్టియన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఆసీస్ బ్యాటర్లలో క్రిస్టియన్(69) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాన్ మార్ష్(41) పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో కులకర్ణి రెండు, ఆర్పీ సింగ్, అనురీత్, హార్భజన్ సింగ్ తలా వికెట్ సాధించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో జూలై 10న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment