సూపర్‌ క్యాచ్‌.. వైరల్‌ వీడియో | A Great Juggling Catch By Angelo Perera In LLC 2024 | Sakshi
Sakshi News home page

సూపర్‌ క్యాచ్‌.. వైరల్‌ వీడియో

Published Fri, Oct 4 2024 1:28 PM | Last Updated on Fri, Oct 4 2024 3:11 PM

A Great Juggling Catch By Angelo Perera In LLC 2024

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌-2024లో ఓ సూపర్‌ క్యాచ్‌ నమోదైంది. తోయమ్‌ హైదరాబాద్‌, మణిపాల్‌ టైగర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఈ సూపర్‌ క్యాచ్‌కు వేదికైంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆటగాడు షాన్‌ మార్ష్‌ ఆడిన భారీ షాట్‌ను టైగర్స్‌ ఆటగాడు ఏంజెలో పెరీరా అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. గుణరత్నే బౌలింగ్‌లో పెరీరా ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మణిపాల్‌ టైగర్స్‌, తోయమ్‌ హైదరాబాద్‌ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ 'టై'గా (‌ఇరు జట్ల స్కోర్లు సమం) ముగియడంతో సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో హైదరాబాద్‌పై మణిపాల్‌ టైగర్స్‌ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టైగర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తిసార పెరీరా మెరుపు ఇన్నింగ్స్‌ (27 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి టైగర్స్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఏంజెలో పెరీరా (18), పియెనార్‌ (11) రెండంకెల స్కోర్లు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో గురుకీరత్‌ సింగ్‌, బిపుల్‌ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. ఉడాన, నువాన్‌ ప్రదీప్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి టైగర్స్‌ చేసినన్ని పరుగులే (144) చేసింది. దీంతో మ్యాచ్‌ టైగా ముగిసి సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. హైదరాబాద్‌ను గెలిపించేందుకు స్టువర్ట్‌ బిన్నీ (20 నాటౌట్‌), గురుకీరత్‌ సింగ్‌ మాన్‌ (37 నాటౌట్‌), షాన్‌ మార్ష్‌ (38) విఫలయత్నం చేశారు.

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా..
సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన తోయమ్‌ హైదరాబాద్‌ వికెట్‌ నష్టానికి కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఐదు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మణిపాల్‌ టైగర్స్‌ మూడు బంతుల్లోనే విజయతీరాలకు చేరింది. బిపుల్‌ శర్మ బౌలింగ్‌లో డేనియల్‌ క్రిస్టియన్‌ సిక్సర్‌ బాది టైగర్స్‌ను గెలిపించాడు.

చదవండి: డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న అభిమన్యు ఈశ్వరన్‌

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement