breaking news
Angelo Perera
-
సూపర్ క్యాచ్.. వైరల్ వీడియో
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2024లో ఓ సూపర్ క్యాచ్ నమోదైంది. తోయమ్ హైదరాబాద్, మణిపాల్ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ సూపర్ క్యాచ్‌కు వేదికైంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు షాన్ మార్ష్ ఆడిన భారీ షాట్‌ను టైగర్స్ ఆటగాడు ఏంజెలో పెరీరా అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. గుణరత్నే బౌలింగ్‌లో పెరీరా ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.A great juggling catch by Angelo Perera in the LLC. 😄 pic.twitter.com/t5GyFNJ4hb— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. మణిపాల్ టైగర్స్, తోయమ్ హైదరాబాద్ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ 'టై'గా (ఇరు జట్ల స్కోర్లు సమం) ముగియడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో హైదరాబాద్‌పై మణిపాల్ టైగర్స్ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తిసార పెరీరా మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి టైగర్స్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఏంజెలో పెరీరా (18), పియెనార్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో గురుకీరత్ సింగ్, బిపుల్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. ఉడాన, నువాన్ ప్రదీప్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి టైగర్స్ చేసినన్ని పరుగులే (144) చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. హైదరాబాద్‌ను గెలిపించేందుకు స్టువర్ట్ బిన్నీ (20 నాటౌట్), గురుకీరత్ సింగ్ మాన్ (37 నాటౌట్), షాన్ మార్ష్ (38) విఫలయత్నం చేశారు.సూపర్ ఓవర్ సాగిందిలా..సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన తోయమ్ హైదరాబాద్ వికెట్ నష్టానికి కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఐదు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మణిపాల్ టైగర్స్ మూడు బంతుల్లోనే విజయతీరాలకు చేరింది. బిపుల్ శర్మ బౌలింగ్‌లో డేనియల్ క్రిస్టియన్ సిక్సర్ బాది టైగర్స్‌ను గెలిపించాడు.చదవండి: డబుల్ సెంచరీ చేజార్చుకున్న అభిమన్యు ఈశ్వరన్ -
రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ద్విశతకాలు చేసిన క్రికెటర్
కొలంబో: శ్రీలంక క్రికెటర్ ఏంజెలో పెరీరా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. శ్రీలంక దేశవాళీ క్రికెట్లో భాగంగా నాండేస్రిప్ట్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న పెరీరా.. అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసిన పెరీరా.. రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 203 బంతులను ఎదుర్కొని 20 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో డబుల్ సెంచరీ సాధించాడు. ఇక్కడ అతని స్ట్రైక్‌రేట్ దాదాపు వంద ఉండటం విశేషం. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో 268 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్లతో 231 పరుగుల్ని నమోదు చేశాడు. ఫలితంగా ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ద్విశతకాలు సాధించిన రెండో క్రికెటర్‌గా పెరీరా గుర్తింపు సాధించాడు. అంతకుముందు 1938లో ఇంగ్లిష్ క్రికెటర్ ఆర్థర్ ఫాగ్ ఒకే మ్యాచ్‌లో రెండు ద్విశతకాలు సాధించాడు. ఆ తర్వాత ఇంతకాలానికి ఆ ఫీట్‌ను పెరీరా అందుకున్నాడు. 2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన పెరీరా.. ఇప్పటివరకూ కేవలం నాలుగు వన్డేలు, రెండు టీ20లు మాత్రమే ఆడాడు. అతను చివరగా ఆస్ట్రేలియాతో 2016లో జరిగిన సిరీస్‌లో లంక తరఫున కనిపించాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 97 మ్యాచ్‌లు ఆడిన పెరీరా 18 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలతో 6,941 పరుగులు చేశాడు.