
విండీస్ దిగ్గజం క్రిస్ గేల్, భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటకి తమలో ఏమాత్రం జోరుతగ్గలేదని మరోసారి నిరూపించారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ)2024లో గేల్, ధావన్ మెరుపులు మెరిపించారు.
ఈ లీగ్‌లో గుజరాత్ గ్రేట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరూ లెజెండరీ క్రికెటర్లు.. శుక్రవారం కోనార్క్ సూర్యాస్ ఓడిశా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. కోనార్క్ జట్టు కెప్టెన్ టాస్ గెలిచి తొలుత గుజరాత్ టీమ్‌ను బ్యాటింగ్ ఆహ్హనించాడు.
గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వ్యాన్ వాయక్(2)ను ఆదిలోనే పేసర్ వినయ్ కుమార్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గేల్..ధావన్‌తో కలిసి ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.
గేల్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేయగా.. ధావన్ 24 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరితో ప్రసన్న(31) పరుగులతో రాణించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ గ్రేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది.
అనంతం 142 పరుగుల లక్ష్యంతో దిగిన కోనార్క్ కేవలం 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోనార్క్ బ్యాటర్లలో మునివీరా(47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓబ్రియన్(43) పరుగులతో రాణించాడు.
Chris Gayle 🤝 Shikhar Dhawan. 🔥
- Gabbar and universe Boss together in the LLC. 🤯 pic.twitter.com/N8r4pbtQ3f— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2024