లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)-2024 సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ క్రికెట్ టోర్నీ.. ఇప్పుడు మూడో సీజన్‌కు సిద్దమవుతోంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గోనునున్నాయి. తొలి సీజన్(2022)లో ఇండియా క్యాపిటల్స్ విజేతగా.. రెండువ సీజన్‌లో మణిపాల్ టైగార్స్ ఛాంపియన్‌గా అవతరించింది.
ఇక ఇది ఇలా ఉండగా.. ఎల్ఎల్‌సీ మూడో సీజన్‌కు సంబంధించిన వేలం ముంబై వేదికగా గురువారం(ఆగస్టు 29)న జరిగింది. అయితే భారత మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ ఈ ఏడాది ఎల్ఎల్‌సీ సీజన్‌లో భాగం కావడంతో మరింత ప్రాధన్యత సంతరించుకుంది. వేలానికి ముందే శిఖర్ ధావన్‌ను గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకోగా.. కార్తీక్‌తో సదరన్ సూపర్ స్టార్స్ ఒప్పందం కుదర్చుకుంది.
అయితే ధావన్, కార్తీక్‌ల కోసం ఆయా ఫ్రాంచైజీలు ఎంత మొత్తం వెచ్చించియో వెల్లడించలేదు. వీరిద్దరూ మినహా మిగితా క్రికెటర్లందరూ వేలంలో పాల్గోనున్నారు. మొత్తం ఈ వేలంలో దాదాపు 300 మంది క్రికెటర్లు పాల్గోనగా.. 97 మంది మాత్రమే అమ్ముడు పోయారు.
ఈ 97 మంది క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఆరు ఫ్రాంచైజీలు మొత్తం రూ. 39.63 కోట్లు వెచ్చించాయి. ఈ వేలంలో శ్రీలంకకు చెందిన ఇసురు ఉదానా అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ. అర్బనైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 62 లక్షలకు సొంతం చేసుకుంది.
ఉదానా తర్వాత భారీ ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ నిలిచాడు. అతడిని కూడా అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కాగా బ్రెట్‌లీ, దిల్షాన్, షాన్ మార్ష్, ఫించ్, ఆమ్లా వంటి దిగ్గజ క్రికెటర్లు అమ్ముడుపోలేదు.
వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..
మణిపాల్ టైగర్స్
హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప, తిసర పెరీరా, షెల్డన్ కాట్రెల్, డాన్ క్రిస్టియన్, ఏంజెలో పెరీరా, మనోజ్ తివారీ, అసేలా గుణరత్నే, సోలమన్ మిరే, అనురీత్ సింగ్, అబు నెచిమ్, అమిత్ వర్మ, ఇమ్రాన్ ఖాన్, రాహుల్ శుక్లా, అమిటోజ్ సింగ్, ప్రవీణ్ గుప్తా, సౌరభ్ గుప్తా .
ఇండియా క్యాపిటల్స్
యాష్లే నర్స్, బెన్ డంక్, డ్వేన్ స్మిత్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, నమన్ ఓజా, ధవల్ కులకర్ణి, క్రిస్ మ్ఫోఫు, ఫైజ్ ఫజల్, ఇక్బాల్ అబ్దుల్లా, కిర్క్ ఎడ్వర్డ్స్, రాహుల్ శర్మ, పంకజ్ సింగ్, జ్ఞానేశ్వరరావు, భరత్ చిప్లి, పర్వీందర్ అవానా, పవన్ సుయాల్, మురళీ సుయాల్ విజయ్, ఇయాన్ బెల్.
గుజరాత్ జెయింట్స్
క్రిస్ గేల్, లియామ్ ప్లంకెట్, మోర్నే వాన్ వైక్, లెండిల్ సిమన్స్, అసోహర్ అఫోహాన్, జెరోమ్ టేలర్, పరాస్ ఖాడా, సీక్కుగే ప్రసన్న, కమౌ లెవర్‌రాక్, సైబ్రాండ్ ఎనోయెల్‌బ్రెచ్ట్, షానన్ గాబ్రియేల్, సమర్ క్వాద్రీ, మహమ్మద్ కైఫ్, శ్రీసన్హవాన్, శ్రీసన్హవాన్.
కోణార్క్ సూర్యస్ ఒడిశా
ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, కెవిన్ ఓ బ్రియాన్, రాస్ టేలర్, వినయ్ కుమార్, రిచర్డ్ లెవీ, దిల్షన్ మునవీర, షాబాజ్ నదీమ్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, బెన్ లాఫ్లిన్, రాజేష్ బిష్ణోయ్, ప్రవీణ్ తాంబే, దివేష్ పఠానియా, కేపీ అప్పన్న, అంబటి రాయుడు, అంబటి రాయుడు.
సదరన్ సూపర్ స్టార్స్
దినేష్ కార్తీక్, ఎల్టన్ చిగుంబుర, హామిల్టన్ మసకద్జా, పవన్ నేగి, జీవన్ మెండిస్, సురంగ లక్మల్, శ్రీవత్స్ గోస్వామి, హమీద్ హసన్, నాథన్ కౌల్టర్ నైల్, చిరాగ్ గాంధీ, సుబోత్ భాటి, రాబిన్ బిస్ట్, జెసల్ కరీ, చతురంగ డి సిల్వా, మోను కుమార్
అర్బన్‌రైజర్స్ హైదరాబాద్
సురేష్ రైనా (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, డ్వేన్ స్మిత్, టినో బెస్ట్, స్టువర్ట్ బిన్నీ, క్రిస్టోఫర్ ఎంఫోఫు, అస్గర్ ఆఫ్ఘన్, చమర కపుగెదెరా, పీటర్ ట్రెగో, రిక్కీ క్లార్క్, పవన్ సుయాల్, ప్రజ్ఞాన్ ఓజా, శివ కాంత్ శుక్లా, సుదీప్ త్యాగి, తిరుమలశెట్టి సుమన్, యోగేష్ నగర్, షాదాబ్ జకాతి, జెరోమ్ టేలర్, గురుకీరత్ మాన్, అమిత్ పౌనికర్, దేవేంద్ర బిషూ.
Comments
Please login to add a commentAdd a comment