హర్భజన్‌ మాయాజాలం.. కలిస్‌, గేల్‌ మెరుపులు వృధా | Legends League Cricket 2023: Parvinder Awana, Harbhajan Stars As Manipal Beat Gujarat By 10 Runs | Sakshi
Sakshi News home page

హర్భజన్‌ మాయాజాలం.. కలిస్‌, గేల్‌ మెరుపులు వృధా

Published Tue, Nov 21 2023 8:52 AM | Last Updated on Tue, Nov 21 2023 10:00 AM

Legends League Cricket 2023: Parvinder Awana, Harbhajan Stars As Manipal Beat Gujarat By 10 Runs - Sakshi

లెజెండ్‌ లీగ్‌ క్రికెట్‌ 2023 ఎడిషన్‌లో భాగంగా గుజరాత్‌ జెయింట్స్‌తో నిన్న (నవంబర్‌ 20) జరిగిన మ్యాచ్‌లో మణిపాల్‌ టైగర్స్‌ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టైగర్స్‌.. హ్యామిల్టన్‌ మసకద్జ (37), తిసార పెరీరా (32), రాబిన్‌ ఉతప్ప (23) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.  జెయింట్స్‌ బౌలర్లలో రజత్‌ భాటియా 3, ట్రెంట్‌ జాన్స్టన్‌ 2, ఎమ్రిట్‌, ఈశ్వర్‌ చౌదరీ, లడ్డా తలో వికెట్‌ పడగొట్టారు.  

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జెయింట్స్‌.. పర్వీందర్‌ అవానా (3-0-19-4), హర్భజన్‌ సింగ్‌ (4-1-14-2), తిసార పెరీరా (2-0-6-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. క్రిస్‌ గేల్‌ (24 బంతుల్లో 38; 7 ఫోర్లు, సిక్స్‌), జాక్‌ కలిస్‌ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు), పార్థివ్‌ పటేల్‌ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్‌) జెయింట్స్‌ను గెలిపించే​ందుకు విఫలయత్నం చేశారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 21) సథరన్‌ సూపర్‌ స్టార్స్‌, అర్బన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement