లెజెండ్స్ లీగ్ 2023 ఎడిషన్ తుది అంకానికి చేరింది. ఫైనల్లో తలపడబోయే జట్లేవో తేలిపోయాయి. క్వాలిఫయర్-1లో విజయం సాధించడం ద్వారా అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరింది. నిన్న (డిసెంబర్ 7) జరిగిన క్వాలిఫయర్-2లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ఇండియా టైగర్స్‌ను ఓడించడం ద్వారా హర్భజన్ సింగ్ సారథ్యంలోని మణిపాల్ టైగర్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
క్వాలిఫయర్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్.. కెవిన్ పీటర్సన్ (27 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మెక్‌క్లెనెగన్, తిసార పెరీరా తలో 3 వికెట్లు తీసి క్యాపిటల్స్ పతనాన్ని శాశించారు.
అనంతరం బరిలోకి దిగిన మణిపాల్ టైగర్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అసేల గుణరత్నే (39 నాటౌట్), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (38 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి టైగర్స్‌ను విజయతీరాలకు చేర్చారు. టైగర్స్ ఇన్నింగ్స్‌లో చాడ్విక్ వాల్టన్ (33), ఏంజెలో పెరీరా (35) కూడా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఇసురు ఉడాన, దిల్హర ఫెర్నాండో, ఈశ్వర్ పాండే తలో వికెట్ పడగొట్టారు. టోర్నీ ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 9న జరుగనుంది. టైటిల్ కోసం అర్బన్ రైజర్స్ హైదరాబాద్, మణిపాల్ టైగర్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment