లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కింద ఇద్దరు భారతీయులను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యోని పటేల్, పీ ఆకాష్ అనే ఇద్దరు ఇద్దరు ఇండియన్స్ లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో అనాధికర మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించినట్లు శ్రీలంక పోలీసులు గుర్తించారు.
మార్చి 8న, మార్చి 19న కెండీలోని పల్లెకెలే స్టేడియంలో జరిగిన మ్యాచులను ఫిక్స్ చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు భారతీయులు బెయిల్ మీద బయటికి వచ్చారు. అయితే ఈ కేసు విచారణ ముగిసేవరకూ దేశం వదిలి వెళ్లకుండా వారి పాస్‌పోర్ట్‌లను సీజ్ చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది.
ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 టోర్నీ ఫైనల్లో రాజస్తాన్ కింగ్స్, న్యూయార్క్ సూపర్ స్ట్రైయికర్స్ జట్లు తలపడ్డాయి. రాజస్తాన్ కింగ్స్ జట్టు ఛాంపియన్స్‌గా నిలిచింది. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిలో ఒకడైన పటేల్, లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఆడిన క్యాండీ కాంప్ ఆర్మీ టీమ్‌కి యజమాని కావడం గమనార్హం.
కాగా ఈ ఇద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్టుగా న్యూజిలండ్ మాజీ క్రికెటర్ నీల్ బ్రూమ్, శ్రీలంక ఛీప్ సెలక్టర్ ఉపుల్ తరంగ.. క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ స్పెషల్ ఇగ్వెస్టిగేషన్ యూనిట్‌కి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment