
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్‌కు తెరలేచింది. ఈ లీగ్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో రాంఛీ వేదికగా ఇండియా క్యాపిటల్స్,భిల్వారా కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భిల్వారా కింగ్స్ కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ ఇండియా క్యాపిటల్స్‌ను తొలుత బ్యాటింగ్ ఆహ్వానించాడు. ఈ క్రమంలో మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఇండియా క్యాపిటల్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా క్యాపిటల్స్ కెప్టెన్ గౌతం గంభీర్ ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గంభీర్ కేవలం 35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు క్రిక్ ఎడ్‌వర్డ్స్(59), బెన్ డంక్(16 బంతుల్లో 37), నర్స్(34) పరుగలు చేశాడు. భిల్వారా కింగ్స్ బౌలర్లలో అనురిత్ సింగ్ 4 వికెట్లతో అదరగొట్టాడు.
చదవండి: ఆసీస్‌తో అంత ఈజీ కాదు.. ఏమి చేయాలో మాకు బాగా తెలుసు: రోహిత్ శర్మ