
విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ స్టేడియంలో ముగిసే లీగ్‌దశ చివరి ఫేజ్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఎల్‌ఎల్‌సీ నాకవుట్‌కు చేరుకుంటాయని ఏసీఏ అపెక్స్ కౌ న్సిల్ కార్యదర్శి ఎస్‌ఆర్ గోపినాథరెడ్డి తెలి పారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ)లో చివరి దశ పోటీల్లో భాగంగా శనివారం తలపడనున్న జట్ల ఆటగాళ్లు శుక్రవారం విశాఖ చేరుకున్నారని చెప్పారు. నాకవుట్ పోటీలు సూరత్‌లో జరుగనున్నాయన్నారు. ఇండియా కాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయింట్స్‌తో పాటు సదరన్ సూపర్‌స్టార్స్ జట్ల సభ్యులు విశాఖ చేరుకోగా ఎయిర్‌పోర్టులో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఘనంగా స్వాగతం పలికిందని తెలిపారు. అర్బన్‌రైజర్స్ జట్టు శనివారం విశాఖ చేరుకోనుందని చెప్పారు.
విశాఖలో మ్యాచ్‌లు..
శనివారం రాత్రి ఏడుగంటలకు ఇండియా కాపిటల్స్ జట్టుతో మణిపాల్ టైగర్స్ తలపడనుండగా, ఆదివారం మధ్యాహ్నం మూడుగంటలకు గుజరాత్ జెయింట్స్‌తో సదరన్ సూపర్‌స్టార్స్ జట్టు తలపడనుంది. 4వ తేదీ రాత్రి ఏడుగంటలకు లీగ్ దశలో చివరి మ్యాచ్ రాత్రి ఏడుగంటలకు మణిపాల్ టైగర్స్‌తో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment