LLC 2024: బెన్‌ డంక్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ | LLC 2024: India Capitals Scored 171 For 4 Vs Southern Super Stars | Sakshi
Sakshi News home page

LLC 2024: బెన్‌ డంక్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ

Published Wed, Sep 25 2024 9:02 PM | Last Updated on Wed, Sep 25 2024 9:02 PM

LLC 2024: India Capitals Scored 171 For 4 Vs Southern Super Stars

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో ఇండియా క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బెన్‌ డంక్‌ మెరుపు హాఫ్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు. సథరన్‌ సూపర్‌ స్టార్స్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 25) జరుగుతున్న మ్యాచ్‌లో డంక్‌ 29 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. డంక్‌కు ఆష్లే నర్స్‌ (24 బంతుల్లో 40 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు). డ్వేన్‌ స్మిత్‌ (33 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడు కావడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 

ఫయాజ్‌ ఫజల్‌ 9, నమన్‌ ఓజా 16 పరుగులు చేసి ఔట్‌ కాగా.. కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు. సథరన్‌ సూపర్‌ స్టార్స్‌ బౌలర్లలో జేసల్‌ కరియ రెండు వికెట్లు పడగొట్టగా.. అబ్దుర్‌ రజాక్‌, పవన్‌ నేగి తలో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్‌ స్టార్స్‌ రెండు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్తిల్‌ 14, శ్రీవట్స్‌ గోస్వామి 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

చదవండి: కోహ్లిలో ఊపు తగ్గింది.. సచిన్‌ రికార్డులు బద్దలు కొట్టలేడు: ఆసీస్‌ మాజీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement