భారత్‌-పాక్‌ సిరీస్‌; రాజకీయాలు సరికాదు | Yuvraj Singh Shahid Afridi Wish Bilateral Series Between India And Pakistan | Sakshi
Sakshi News home page

‘భారత్‌-పాక్‌ సిరీస్‌ యాషెస్‌ కంటే గొప్పది’

Published Wed, Feb 12 2020 2:35 PM | Last Updated on Wed, Feb 12 2020 3:17 PM

Yuvraj Singh Shahid Afridi Wish Bilateral Series Between India And Pakistan - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌-పాకిస్తాన్‌ మధ్య జరిగే క్రికెట్‌ సిరీస్‌లు యాషెస్‌ సిరీస్‌ కంటే ఎక్కువగా అభిమానులకు ఉత్సాహాన్నిస్తాయని టీమిండియా, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, షాహిద్‌ అఫ్రిది అభిప్రాయపడ్డారు. భారత్‌-పాక్‌ మధ్య 2004, 2006, 2008లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లను తానెంతో ఎంజాయ్‌ చేశానని యువీ గుర్తుచేసుకున్నాడు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని అన్నాడు. ‘ఇష్టంతోనే ఆటల్ని కొనసాగించాలి. కానీ, మనతో ఆడుతున్న దేశాన్ని ఓ ప్రత్యర్థిగా భావించకూడదు. ఇండియా-పాక్‌ మధ్య సిరీస్‌లు తిరిగి పునరుద్ధరిస్తే అది క్రికెట్‌కే కాకుండా అన్ని ఆటలకు కూడా మంచిది’ అని పేర్కొన్నాడు.
(చదవండి : ‘క్రికెట్‌ దేవుడిని మరోసారి గెలిపించండి’)

రాజకీయాలు తగవు : షాహిద్‌ అఫ్రిది
‘రెండు పొరుగు దేశాల మధ్య క్రికెట్‌ సిరీస్‌ ఉందంటే అది యాషెస్‌ కంటే గొప్పగా ఆదరణ పొందేది. అయితే, తాజా పరిస్థితులు అందుకు అనుగుణంగా కనినిపిస్తోంది. ప్రజలు ఎంతగానో ఇష్టపడే.. ఆటల్లో కూడా రాజకీయాలు జోక్యం చేసుకోవడమే ఈ పరిస్థితులకు కారణం. మళ్లీ మునుపటి పరిస్థితులు వస్తే బాగుటుందని ఆశిద్దాం. ఇప్పటికైనా కొన్ని విషయాల్ని ఇరు దేశాలు పక్కనబెట్టి.. చర్చిస్తే బాగుంటుంది. చర్చలతో పరిస్థితులు మెరుగవ్వచ్చు’అని అఫ్రిది అన్నాడు. ఇక బహుళ దేశాల టోర్నీల్లో భారత్‌-పాక్‌ తలపడుతున్నా.. ఇరు దేశాల మధ్య 2013లో జరిగిన ద్వైపాక్షిక సిరీసే చివరిది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన యువీ, అఫ్రీదీ విదేశీ టీ20 లీగుల్లో ఆడుతుండటం తెలిసిందే.
(చదవండి :‘టీ20ల్లో డబుల్‌ సెంచరీ కొట్టే చాన్స్‌ వారికే ఉంది’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement