bilateral series
-
IND VS ENG 4th Test: ఓటమి ఎరుగని హిట్‌మ్యాన్
ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌ల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ జైత్రయాత్ర కొనసాగుతుంది. సుదీర్ఘ ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో హిట్‌మ్యాన్ ఇప్పటివరకు ఓటమనేది ఎరుగడు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రస్తానం 2021-22 శ్రీలంక సిరీస్‌తో (స్వదేశంలో 2-0 తేడాతో టీమిండియా గెలిచింది) మొదలైంది. అప్పటి నుంచి హిట్‌మ్యాన్ సారథ్యంలో టీమిండియా ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా కోల్పోలేదు. శ్రీలంక సిరీస్ తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. ఆస్ట్రేలియాపై (స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో), వెస్టిండీస్‌పై (వెస్టిండీస్‌పై వారి దేశంలో 1-0 తేడాతో), తాజాగా ఇంగ్లండ్‌పై (స్వదేశంలో ఇంగ్లండ్‌పై 3-1 తేడాతో, మరో టెస్ట్ మిగిలి ఉంది) వరుస సిరీస్ విజయాలు సాధించింది. మధ్యలో సౌతాఫ్రికా సిరీస్ (వారి దేశంలోనే) ఒక్కటి డ్రాగా (1-1) ముగిసింది. ఇదిలా ఉంటే, రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ గెలుపుతో స్వదేశంలో టీమిండియా విజయపరంపర మరింత మెరుగుపడింది. సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర 11 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో భారత జట్టు స్వదేశంలో రికార్డు స్థాయిలో 17 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించింది. 2013 ఫిబ్రవరిలో మొదలైన టీమిండియా జైత్రయాత్ర ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ వరకు అప్రతిహతంగా సాగుతుంది. ప్రపంచంలో ఏ జట్టు స్వదేశంలో వరుసగా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించలేదు. భారత్ తర్వాత అత్యధికంగా ఆస్ట్రేలియా రెండుసార్లు (1994-2001, 2004-2008) స్వదేశంలో వరుసగా 10 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. భారత్, ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్ (1976-1986), న్యూజిలాండ్ (2017-2021) జట్లు స్వదేశంలో 8 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించాయి. నాలుగో టెస్ట్ మ్యాచ్ స్కోర్ వివరాలు.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 353 (రూట్ 122 నాటౌట్, జడేజా 4/67) భారత్ తొలి ఇన్నింగ్స్ 307 (దృవ్ జురెల్ 90, షోయబ్ బషీర్ 5/119) ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 145 (జాక్ క్రాలే 60, అశ్విన్ 5/51) భారత్ రెండో ఇన్నింగ్స్ 192/5 (రోహిత్ శర్మ 55, షోయబ్ బషీర్ 3/79) 5 వికెట్ల తేడాతో భారత్ విజయం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: దృవ్ జురెల్ -
వన్డేల్లో పైచేయి ఎవరిదో?
ఆక్లాండ్: భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు మరో ఏడాదికంటే తక్కువ సమయం ఉంది. వచ్చే అక్టోబర్–నవంబర్లలో ఈ టోర్నీ జరగనుంది. దాంతో ఇప్పటినుంచి జరిగే ప్రతీ మ్యాచ్‌ను టీమిండియా సన్నాహకాల్లో భాగంగానే చెప్పవచ్చు. రెగ్యులర్ ఆటగాళ్లతో పాటు జట్టులో అవకాశం సాధించే సత్తా ఉన్న కుర్రాళ్లను కూడా పరీక్షించేందుకు ఈ వరుస ద్వైపాక్షిక సిరీస్‌లు ఉపయోగపడనున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే తొలి పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. టి20 సిరీస్‌ను గెలుచుకొని భారత బృందం జోరు మీదుంది. తుది జట్టులో చోటు కోసం... శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు ఈ వన్డే సిరీస్ బరిలోకి దిగుతోంది. అయితే అతని బ్యాటింగ్ ఫామ్ అంత గొప్పగా లేదు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లోనూ విఫలమైన ధావన్...చెప్పుకోదగ్గ స్కోరు సాధించిన మ్యాచ్‌లలోనూ బాగా నెమ్మదిగా ఆడుతూ పేలవ స్ట్రైక్‌రేట్‌తో నమోదు చేశాడు. వచ్చే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తున్న అతను ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో బ్యాట్ ఝళిపించాల్సిందే. రెండో ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ ఖాయం. ఈ ఏడాది అతను 75.71 సగటుతో 9 మ్యాచ్‌లలోనే 530 పరుగులు సాధించిన తన సత్తాను ప్రదర్శించాడు. కోహ్లి లేకపోవడంతో మూడో స్థానంలో ఆడే శ్రేయస్ అయ్యర్‌కు ఇది మరో మంచి చాన్స్. టి20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన అయ్యర్ ఇక్కడైనా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత మిడిలార్డర్లో సూర్యకుమార్, పంత్‌లు దూకుడు ప్రదర్శించగలరు. అదనపు బౌలింగ్ ప్రత్యామ్నాయంగా ఉన్న దీపక్ హుడాను ఆడిస్తారా లేక టి20 సిరీస్‌లో అవకాశం దక్కని సామ్సన్ను ఎంపిక చేస్తారా చూడాలి. సుందర్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలకం కానున్నాడు. దీపక్ చహర్, శార్దుల్, అర్‡్షదీప్లు పేస్ బౌలింగ్ భారం మోస్తారు. కుల్దీప్ యాదవ్, చహల్‌లలో ఒకరికే రెండో స్పిన్నర్‌గా చాన్స్ లభిస్తుంది. విలియమ్సన్ ఫామ్‌లోకి వస్తాడా... టి20లతో పోలిస్తే వన్డేలకు కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ శైలి సరిగ్గా సరిపోతుంది. కాబట్టి ఈ సిరీస్‌లో తమ కెప్టెన్ రాణించాలని జట్టు కోరుకుంటోంది. టి20 సిరీస్‌తో పోలిస్తే కాన్వే కేవలం బ్యాటర్ పాత్రమే పరిమితం కానుండగా, లాథమ్ కీపింగ్ బాధ్యతలు చూస్తాడు. ఓపెనర్ అలెన్‌పై కివీస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మిడిలార్డర్లో లాథమ్, మిచెల్, ఫిలిప్స్ జట్టుకు భారీ స్కోరు అందించగలరు. నీషమ్, సాన్‌ట్నర్ రూపంలో ఆల్‌రౌండ్‌ర్లు అందుబాటులో ఉండగా...ముగ్గురు పేసర్లు సౌతీ, హెన్రీ, ఫెర్గూసన్‌లకు సొంత గడ్డపై ఘనమైన రికార్డు ఉంది. పిచ్, వాతావరణం ఈడెన్ పార్క్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. పిచ్‌కు నేరుగా ఉండే బౌండరీలు మరీ చిన్నవి కాబట్టి భారీ స్కోర్లను ఆశించవచ్చు. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. -
Asia Cup 2022: ‘ఆసియా’ అందుకునేందుకు..
దుబాయ్: టి20 ప్రపంచ కప్‌కు ముందు ఈ ఫార్మాట్లో ఉపఖండపు ప్రధాన జట్లు సన్నాహకానికి సన్నద్ధమయ్యాయి. ద్వైపాక్షిక సిరీస్‌లు కాకుండా కొంత విరామం తర్వాత భారత జట్టు కూడా రెండుకంటే ఎక్కువ జట్లు ఉన్న టోర్నీలో బరిలోకి దిగుతోంది. దాంతో ఆసియా కప్ టోర్నమెంట్ ఆసక్తికరంగా మారింది. ఆతిథ్యం ఇవ్వాల్సిన శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో చేతులెత్తేయడంతో చివరి నిమిషంలో వేదిక యూఏఈకి మారింది. తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే ఈ సమయంలో ఆటగాళ్లకు ఇది కూడా సవాల్. టి20 ప్రపంచ కప్ జరిగే ఆస్ట్రేలియాతో పోలిస్తే పిచ్‌లు, పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం ఉన్నా, తమ ఆటగాళ్లను పరీక్షించుకునేందుకు అన్ని జట్లూ ప్రయత్నిస్తాయి. భారత్, పాకిస్తాన్ మధ్య కనీసం రెండు మ్యాచ్‌లతో పాటు మరో మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉండటంతో టోర్నీ పై అభిమానుల ఆసక్తి మరింత పెరిగేలా చేసింది. 2020లో జరగాల్సిన టోర్నీ కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చి రెండేళ్లు ఆలస్యంగా జరుగుతోంది. జట్ల వివరాలు: (గ్రూప్ ‘ఎ’)భారత్, పాకిస్తాన్, హాంకాంగ్. (గ్రూప్ ‘బి’) శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్. ఫార్మాట్: తమ గ్రూప్‌లోని రెండు జట్లతో ఆడిన అనంతరం టాప్–2 టీమ్‌లు ముందంజ వేస్తాయి. అక్కడ మిగిలిన మూడు టీమ్‌లతో తలపడాల్సి ఉంటుంది. టాప్–2 జట్లు ఫైనల్‌కు చేరతాయి. ఐదు టీమ్‌లు నేరుగా టోర్నీలో అడుగు పెట్టగా, క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా హాంకాంగ్ అర్హత సాధించింది. దుబాయ్, షార్జాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్ 11న ఫైనల్ నిర్వహిస్తారు. టోర్నీ చరిత్ర: ఆసియా కప్‌ను ఇప్పటి వరకు 14 సార్లు నిర్వహించారు. 1984–2018 మధ్య ఈ టోర్నమెంట్లు జరిగాయి. అత్యధికంగా 7 సార్లు భారత్ విజేతగా నిలవగా, శ్రీలంక 5 సార్లు టోర్నీ గెలిచింది. పాకిస్తాన్ 2 సార్లు ట్రోఫీని అందుకుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్ బరిలోకి దిగుతోంది. 2018లో వన్డే ఫార్మాట్లో జరిగిన టోర్నీలో రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమిండియా టైటిల్ సాధించింది. 2016లో కూడా ప్రపంచకప్‌కు కొద్ది రోజుల ముందు ఈ టోర్నీని టి20 ఫార్మాట్లోనే నిర్వహించారు. చదవండి: IND vs PAK Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్.. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రోహిత్ డుమ్మా; కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే.. -
సిరీస్ గెలిచే లక్ష్యంతో...
రాంచీ: న్యూజిలాండ్‌తో తొలి టి20లో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు సిరీస్ సొంత చేసుకోవడంపై దృష్టి పెట్టింది. నేడు జరిగే రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ టీమిండియా చెంత చేరుతుంది. మరోవైపు టి20 ప్రపంచకప్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఇప్పుడు ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలిచేందుకు కావాల్సిన అస్త్రశస్త్రాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. లోపాలను సరిదిద్దుకుంటూ... ఈ సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఇది బాగానే ఉన్నా... బౌలింగ్ మొదలుపెట్టిన తీరు, మ్యాచ్ ముగించిన విధానం కాస్త ఆందోళన పరిచే అంశం. మన బౌలింగ్ వైఫల్యంతో కివీస్ ఒక దశలో 13 ఓవర్లలో 106/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అశ్విన్ ఒకే ఓవర్లో చాప్మన్, ఫిలిప్స్‌లను పెవిలియన్ చేర్చాకే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మన చేతుల్లోకి వచ్చారు. అనుభవజ్ఞులైన భువీ, అశ్విన్ తప్ప దీపక్ చహర్, సిరాజ్, అక్షర్ పటేల్‌లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అలాగే సునాయాసంగా ఛేదించాల్సిన లక్ష్యాన్ని ఆఖరి ఓవర్ దాకా తెచ్చుకున్న బ్యాటింగ్ లైనప్‌పై కొత్త కోచ్ ద్రవిడ్ కచ్చితంగా దృష్టిపెట్టాల్సిందే. సూర్యకుమార్ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశమైతే, ఓపెనర్ లోకేశ్ రాహుల్ బ్యాటింగ్‌లో నిలకడ లోపించడం జట్టుకు ఇబ్బందికరం. రోహిత్‌తో కలిసి రాహుల్ చెలరేగితేనే కివీస్‌పై సిరీస్ విజయం సులువవుతుంది. కివీస్ అలసిపోయిందా! న్యూజిలాండ్ ఆదివారం ఫైనల్ ఆడింది. మరో ఆదివారం వచ్చేలోపే నాలుగో మ్యాచ్ ఆడబోతుంది. పైగా వేర్వేరు దేశాల్లో! ఇది ఆటగాళ్లకు ఊపిరి సలపని బిజీ షెడ్యూలే. అయినా సరే ప్రొఫెషనల్ క్రికెటర్లు పోరాటానికి సై అంటున్నారు. వెటరన్ ఓపెనర్ గప్టిల్, టాపార్డర్‌లో చాప్మన్ భారత బౌలింగ్‌ను వణికించారు. వీరికి తోడు మరో ఓపెనర్ డారిల్ మిచెల్, ఫిలిప్స్ ధనాధన్ మెరుపులు మెరిపిస్తే పర్యాటక జట్టు పుంజుకుంటుంది. బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర, బౌలింగ్‌లో టాడ్ ఆస్టల్ విఫలమవడంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ నీషమ్, స్పిన్నర్ ఇష్ సోధిలను ఆడించే అవకాశాలున్నాయి. జట్టు ప్రధాన బౌలర్లు సౌతీ, బౌల్ట్ ఇద్దరూ తేలిపోవడం జట్టును కలవరపెడుతోంది. సీనియర్ సీమర్లు అంచనాలకు తగ్గట్లు రాణిస్తే జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకం సాధిస్తుంది. భారత్‌ను సొంతగడ్డపై ఓడించాలంటే జట్టు మరింత తీవ్రంగా శ్రమించాల్సిందే! పిచ్, వాతావరణం శీతాకాలం దృష్ట్యా ఇక్కడి పిచ్ ఛేదించేందుకు అనుకూలం. దీంతో టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగే ఎంచుకుంటుంది. మంచు వల్ల బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, సూర్యకుమార్, రిషభ్ పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్ /చహల్, దీపక్ చహర్, అశ్విన్, భువనేశ్వర్, సిరాజ్. న్యూజిలాండ్: సౌతీ (కెప్టెన్), గప్టిల్, డారిల్ మిచెల్, చాప్మన్, ఫిలిప్స్, సీఫెర్ట్, నీషమ్, సాన్‌ట్నర్, బౌల్ట్, ఫెర్గూసన్, ఇష్ సోధి. -
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా.. ఈసారైనా నెగ్గుకొచ్చేనా..?
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో(డిసెంబర్) భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈమేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు శుక్రవారం నిర్ధారించింది. పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు, నాలుగు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే ఈ ద్వైపాక్షిక సిరీస్.. వచ్చే ఏడాది జనవరి 25న ముగుస్తుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 17న జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనుంది. అనంతరం సెంచూరియన్ వేదికగా రెండో టెస్ట్ డిసెంబర్ 26న(బాక్సింగ్ డే టెస్ట్), మూడో టెస్ట్ జొహన్నెస్‌బర్గ్ వేదికగా జనవరి 3న మొదలవుతాయి. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే జనవరి 11న, రెండో వన్డే జనవరి 14న, మూడో వన్డే జనవరి 19న జరగనున్నాయి. ఆతర్వాత నాలుగు టీ20 మ్యాచ్‌లు వరుసగా జనవరి 19(పార్ల్), జనవరి 21(కేప్‌టౌన్), జనవరి 23(పార్ల్), జనవరి 26న(పార్ల్) షెడ్యూలయ్యాయి. టీమిండియా చివరిసారిగా 2018లో దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఆ పర్యటనలో భారత్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోగా.. వన్డే, టీ20 సిరీస్‌లను గెలుచుకుంది. ఇక ఇరు జట్ల మధ్య గతేడాది మార్చిలో(భారత పర్యటన) షెడ్యూలైన పరిమిత ఓవర్ల సిరీస్.. కరోనా కారణంగా పూర్తిగా రద్దైన సంగతి తెలిసిందే. చదవండి: స్టార్ ఆటగాళ్లకు మొండిచేయి.. దక్షిణాఫ్రికా టీ20 జట్టు ఇదే -
ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే...
మెల్బోర్న్: షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అంతకు ముందు అక్టోబరు 11, 14, 17 తేదీల్లో భారత్‌తో 3 టి20ల్లో తలపడనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) గురువారం ప్రకటించింది. వీటికి వేదికలు కూడా ఖరారు చేసింది. మరి తర్వాతి రోజునుంచే జరగాల్సిన ప్రపంచకప్ నిర్వహణపై మాత్రం ఇంకా సందేహాలు కనిపిస్తున్నాయి! ఆగస్టు నుంచి ఫిబ్రవరి దాకా జరిగే 2020–21 హోమ్ సీజన్ షెడ్యూల్లో భారత్‌తో 4 టెస్టులు, 3 వన్డేలు కూడా ఉన్నాయి. ఏడు పురుషుల టోర్నీలు, మూడు మహిళల ఈవెంట్లకు సంబంధించిన ద్వైపాక్షిక సిరీస్ షెడ్యూల్‌ను సీఏ ప్రకటించింది. ఆగస్టు 9నుంచి జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్‌తో మళ్లీ అక్కడ అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం అవుతుంది. భారత్‌తో టెస్టులకంటే ముందుగా మూడు టి20లు జరుగుతాయి. అక్టోబర్‌లో విండీస్‌తో మూడు టి20లు, నవంబర్‌లో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, జనవరి, ఫిబ్రవరిల్లో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడుతుంది. భారత్, ఆసీస్ మహిళా జట్ల మధ్య జనవరిలో మూడు వన్డేలు జరుగుతాయి. -
క్రికెట్ ఎలా కొనసాగాలి!
దుబాయ్: మార్చి 13న సిడ్నీలో ప్రేక్షకులు లేకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. అంతే... ఆ తర్వాత కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆగిపోయింది. ప్రతిష్టాత్మక ఐపీఎల్ కూడా నిరవధిక వాయిదా పడింది. కొంత ఎక్కువ, కొంత తక్కువగా తేడా ఉన్నా... మొత్తంగా వివిధ క్రికెట్ బోర్డులకు ఆర్థికపరంగా భారీ దెబ్బ పడింది. కోవిడ్–19 తాజా పరిణామాల నేపథ్యంలో క్రికెట్ భవిష్యత్తుకు సంబంధించి చర్చించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక సమావేశం నిర్వహించనుంది. ఆన్లైన్ ద్వారా గురువారం జరిగే ఈ భేటీలో 12 శాశ్వత సభ్య దేశాలు, మూడు అసోసియేట్ బోర్డులకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొంటారు. అర్ధంతరంగా ఆగిపోయిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కొనసాగింపు, వివిధ ద్వైపాక్షిక సిరీస్‌లు, ప్రతిపాదిత వన్డే సూపర్ లీగ్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది. ఆగిపోయిన వివిధ సిరీస్‌ల కోసం కొత్త తేదీలు ఖరారు చేయడం లేదా రద్దుపై తగిన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. సిరీస్‌ల రద్దుతో ఆర్థికపరంగా వివిధ బోర్డులను ఆదుకునే విషయంపై కూడా మాట్లాడనున్నట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ నిర్వహణ అంశమే ప్రధాన ఎజెండా కావచ్చు. ‘కరోనా నేపథ్యంలో క్రికెట్‌ను కాపాడుకోవడమే ప్రస్తుతం మా అందరి లక్ష్యం. కాబట్టి భేషజాల కోసం, సొంత బోర్డుల ఎజెండా కోసం మాత్రమే కాకుండా మళ్లీ క్రికెట్ జరిగి అందరికీ మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవడం కీలకం’ అని ఐసీసీ సీనియర్ అధికారొకరు వెల్లడించారు. -
భారత్-పాక్ సిరీస్; రాజకీయాలు సరికాదు
న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ సిరీస్‌లు యాషెస్ సిరీస్ కంటే ఎక్కువగా అభిమానులకు ఉత్సాహాన్నిస్తాయని టీమిండియా, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డారు. భారత్-పాక్ మధ్య 2004, 2006, 2008లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లను తానెంతో ఎంజాయ్ చేశానని యువీ గుర్తుచేసుకున్నాడు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని అన్నాడు. ‘ఇష్టంతోనే ఆటల్ని కొనసాగించాలి. కానీ, మనతో ఆడుతున్న దేశాన్ని ఓ ప్రత్యర్థిగా భావించకూడదు. ఇండియా-పాక్ మధ్య సిరీస్‌లు తిరిగి పునరుద్ధరిస్తే అది క్రికెట్‌కే కాకుండా అన్ని ఆటలకు కూడా మంచిది’ అని పేర్కొన్నాడు. (చదవండి : ‘క్రికెట్ దేవుడిని మరోసారి గెలిపించండి’) రాజకీయాలు తగవు : షాహిద్ అఫ్రిది ‘రెండు పొరుగు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ ఉందంటే అది యాషెస్ కంటే గొప్పగా ఆదరణ పొందేది. అయితే, తాజా పరిస్థితులు అందుకు అనుగుణంగా కనినిపిస్తోంది. ప్రజలు ఎంతగానో ఇష్టపడే.. ఆటల్లో కూడా రాజకీయాలు జోక్యం చేసుకోవడమే ఈ పరిస్థితులకు కారణం. మళ్లీ మునుపటి పరిస్థితులు వస్తే బాగుటుందని ఆశిద్దాం. ఇప్పటికైనా కొన్ని విషయాల్ని ఇరు దేశాలు పక్కనబెట్టి.. చర్చిస్తే బాగుంటుంది. చర్చలతో పరిస్థితులు మెరుగవ్వచ్చు’అని అఫ్రిది అన్నాడు. ఇక బహుళ దేశాల టోర్నీల్లో భారత్-పాక్ తలపడుతున్నా.. ఇరు దేశాల మధ్య 2013లో జరిగిన ద్వైపాక్షిక సిరీసే చివరిది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన యువీ, అఫ్రీదీ విదేశీ టీ20 లీగుల్లో ఆడుతుండటం తెలిసిందే. (చదవండి :‘టీ20ల్లో డబుల్ సెంచరీ కొట్టే చాన్స్ వారికే ఉంది’) -
భారత్‌ను అడుక్కోలేం: పాకిస్తాన్
ఇస్లామాబాద్: ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో భారత్‌ను అడుక్కోలేమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నూతన అధ్యక్షుడు ఇషాన్ మణి స్పష్టం చేశారు. రెండు దేశాల ముందుకు వస్తేనే ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజల అభిష్టం మేరకే భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ ఒప్పందాలు పునప్రారంభమవుతాయన్నారు. ‘తమ జట్టు ప్రతి ఒక్కరితో ఆడటానికి సిద్దంగా ఉంది. ముఖ్యంగా భారత్‌తో ఆడేందుకు ఉవ్విళ్లూరుంతోంది. మేం అక్కడికి వెళ్లినా.. వారు వచ్చినా ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. భారత అభిమానులు పాక్‌కు.. పాక్ అభిమానులు భారత్‌కు సంతోషంగా వెళ్లివస్తారు. ఇంతకు మించి ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగవ్వడానికి మరోదారి లేదు. భారత్, పాక్ ప్రజలు ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌ను చూడటానికి ఆసక్తి కనబరుస్తారు. కానీ రాజకీయ నాయకుల వల్లే సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ భవిష్యత్తులో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వారు కూడా ముందుకు వెళ్లలేరు. ఈ విషయంలో నాటకీయం చోటుచేసుకుంది. అదేంటో ఐసీసీ ఈవెంట్లలో భారత్ పాకిస్తాన్‌తో ఆడుతోంది, కానీ ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం ఆడదు. ఇదే మనం అర్థం చేసుకోవాలి. నేను ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం కృషి చేశాను. ఇప్పుడు ఈ విషయంలో జోక్యం చేదలుచుకోలేదు. భారత్‌కు ఆడాలని ఉంటే మాతో ఆడుతారు. లేకుంటే లేదు. అంతేగాని మేం వేళ్లి మాతో ఆడండని అడుక్కోలేం. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగితే మంచిదే’ అని చెప్పుకొచ్చారు. భారత్-పాక్ మధ్య 2013 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడంలేదన్న విషయం తెలిసిందే. -
పాక్‌తో ఆడమంటారా వద్దా?
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడటంపై స్పష్టతనివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరింది. 2012 అనంతరం ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే రెండు దేశాల మధ్య 2014లో కుదిరిన ఒప్పందాన్ని బీసీసీఐ గౌరవించడం లేదని, తమకు 7 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా ఇప్పించాలని కోరుతూ పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు (పీసీబీ) ఐసీసీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వం అనుమతిస్తేనే ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతాయని చెబుతూ వస్తోంది. బీసీసీఐ ఎఫ్‌టీపీని గౌరవించడం లేదంటూ పీసీబీ ఐసీసీ వివాద పరిష్కార కమిటీని ఆశ్రయించింది. ఈ ఒప్పందం ప్రకారం తటస్థ వేదికలో పాక్‌తో టీమిండియా కనీసం రెండు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. ముగ్గురు సభ్యుల కమిటీ పాక్ బోర్డు వేసిన పిటిషన్‌పై విచారణ జరపనుంది. ఈ విషయంలో కమిటీ నిర్ణయమే ఫైనల్ అని ఇప్పటికే ఐసీసీ స్పష్టంచేసింది. అక్టోబర్ 1 నుంచి 3 మధ్య దుబాయ్‌లో ఈ విచారణ జరగనుంది. ఈ విచారణలో భాగంగా ఐసీసీ వివాదాల పరిష్కార బోర్డు ఎదుట తమ వాదనలు వినిపించే ముందు దీనిపై ప్రభుత్వ విధానమేంటో తెలుసుకోవాలని బీసీసీఐ భావించింది. ఈ మేరకు కేంద్రానికి మెయిల్ పంపించిందని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.‘ ఇది బోర్డు తరపున సాధారణంగా జరిగే ప్రక్రియే. ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోవడం మా బాధ్యత. మా పని అడగటం వరకే. అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది ప్రభుత్వం ఇష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో ద్వైపాక్షిక సిరీస్ కష్టమేనని మాకూ తెలుసు. అయితే ఇదే సమాచారం ప్రభుత్వం నుంచి వస్తే మాకు ఉపయోగపడుతుంది’ అని ఆ అధికారి పేర్కొన్నారు. -
29న బీసీసీఐ, పీసీబీ సమావేశం
ద్వైపాక్షిక సిరీస్‌లపై చర్చ దుబాయ్: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణకు సంబంధించి ఈ నెల 29న కీలక సమావేశం జరగనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు దుబాయ్‌లో జరిగే ఈ భేటీలో పాల్గొంటారు. ఎంఓయూ ప్రకారం 2015–2023 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో ఇరు జట్ల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాల్సి ఉంది. అయితే రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇందులో ఒక్క సిరీస్ కూడా జరిగే అవకాశం కనిపిం చడం లేదు. ఇదే విషయంపై ఇటీవల పీసీబీ, భారత్‌కు నోటీసు పంపించగా... ఎంఓయూ అసలు ఒప్పందమే కాదం టూ బీసీసీఐ తేలిగ్గా తీసిపారేసింది. ఈ నేపథ్యంలో సాగే చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. ప్రభుత్వం అనుమతిస్తేనే... మరో వైపు ద్వైపాక్షిక సిరీస్‌ల విషయాన్ని ఇప్పటికే భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామని, అక్కడి నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ‘భారత్, పాక్ క్రికెట్ సిరీస్‌ల విషయంలో యథాతథ స్థితే కొనసాగుతోంది. ఇందులో ఎలాంటి ముందడుగు లేదు. మూడు నెలల క్రితమే భారత ప్రభుత్వానికి అనుమతి కోరుతూ లేఖ రాశాం. మళ్లీ 15 రోజుల క్రితం ఇదే విషయాన్ని గుర్తుచేశాం. కానీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. పాక్‌తో ఆడటమనేది పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఇందులో మేం చేయగలిగిందేమీ లేదు’ అని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పష్టం చేశారు. -
దుబాయ్‌లో ఇండో–పాక్ సిరీస్!
న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య దుబాయ్‌లో ద్వైపాక్షిక సిరీస్ జరిపేందుకు బీసీసీఐ ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాసిందని ఓ వెబ్సైట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సిరీస్ అసాధ్యమని, అలాంటి అనుమతి ఆర్జిలేవి తమకు రాలేదని హోంశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. బీసీసీఐ చీఫ్ (తాత్కాలిక) సీకే ఖన్నా ప్రభుత్వ ఆమోదం కోసం లేఖ రాశారని, దీనిపై వచ్చే నెల 9న జరిగే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎమ్)లో చర్చించనున్నారని ‘క్రికెట్’కు సంబంధించిన వెబ్సైట్ పేర్కొంది. భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లో భాగంగా భారత్ తటస్థ వేదికపై మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20లు ఆడేందుకు పీసీబీకి ప్రతిపాదనలు పంపిందని, దీనికి పాకిస్తాన్ బోర్డు దుబాయ్ వేదికను సూచించిందని ఆ వెబ్సైట్ చెప్పుకొచ్చింది. అయితే భారత ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ ప్రతిపాదనలేవీ రాలేదని స్పష్టం చేశాయి. పఠాన్‌కోట్, ఉరి దాడులతో పాటు తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రాంతాన్ని రాష్ట్రంగా చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలేవీ లేవని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇప్పట్లో ఇండో, పాక్ సిరీస్ అసాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ కుండబద్దలు కొట్టారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, అధికార బీజేపీ పార్టీ ఎంపీ కూడా అయిన అనురాగ్ ఠాకూర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సిరీస్ నిర్వహణ ప్రశ్నేలేదన్నారు. -
పాక్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్!
కరాచి: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఇరు క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఎడిన్బర్గ్లో ఐసీసీ సభ్య దేశాల సమావేశం సందర్భంగా పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ముఖాముఖి సిరీస్ గురించి చర్చించినట్లు తెలిసింది. రెండు దేశాల ప్రభుత్వాల అనుమతి లభిస్తే ఈ సీజన్లోనే తటస్థ వేదికల్లో సిరీస్ నిర్వహించాలని బోర్డు పెద్దలు యోచిస్తున్నారు. -
ఐసీసీ దగ్గర ఇండో-పాక్ క్రికెట్ పంచాయితీ
తమతో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలనే ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని, దీనివల్ల తమకు కోట్లాది రూపాయల నష్టం వచ్చిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి తెలిపింది. సభ్య దేశాలు ఒప్పందాలకు కట్టుబడి ఉండేలా చూడాలని, భారత్‌తో సిరీస్ విషయంలో తమకు న్యాయం చేయాలని పాక్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ఐసీసీకి విన్నవించారు. భారత్‌లో ఐసీసీ ఈవెంట్లలో ఆడేందుకు పాక్ జట్లకు అనుమతి ఇస్తున్నప్పుడు ద్వైపాక్షిక సిరీస్‌లు ఎందుకు ఆడకూడదని ఆయన ప్రశ్నించారు. -
బహిష్కరిస్తే మనకే నష్టం
పీసీబీకి వసీం అక్రమ్ సూచన కరాచీ: భారత్‌తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌పై నాన్చుడు ధోరణికి నిరసనగా వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌ను బాయ్‌కాట్ చేయాలనే ఆలోచన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మానుకోవాలని మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ సూచించారు. ‘పాక్‌తో ఆడాల్సిన సిరీస్‌పై నిర్ణయం కోసం భారత్ చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్న విషయం నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సిరీస్ జరగకపోయినా భవిష్యత్‌లో కచ్చితంగా ఉంటుంది. భారత్‌లో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను బహిష్కరించే ఆలోచన పీసీబీ మానుకోవాలి. ఎందుకంటే అది ఐసీసీ ఈవెంట్. ఎట్టి పరిస్థితిలోనైనా అందులో పాల్గొనాల్సిందే. అదే జరగకపోతే భవిష్యత్ లో మనకే నష్టం. రెండు జట్ల మధ్య సిరీస్‌లు జరిగినా జరగకపోయినా ఉగ్రవాదం మాత్రం అంతరించదు’ అని అక్రమ్ తేల్చి చెప్పారు. -
ఇండో-పాక్ సిరీస్ కష్టమే
షహర్యార్ నిరాశ కరాచీ: ఓ చిన్న సిరీస్ ద్వారా భారత్, పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ పునరుద్దరించాలన్న ఆశలు అడుగంటిపోతున్నాయని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ అన్నారు. ఇక సిరీస్ నిర్వహించేందుకు సమయం కూడా సరిపోదని స్పష్టం చేశారు. ‘ఓ సమావేశం కోసం ఇస్లామాబాద్ వచ్చిన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా సిరీస్ పునరుద్ధరణకు సాయం చేయలేకపోయారు. అలాగే లంకలో చిన్న సిరీస్ నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చదని సంకేతాలిచ్చారు. సుష్మా రాకతో పరిస్థితిలో కొంతైనా మార్పు వస్తుందని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. మేం భారత్‌తో ఆడాలనుకుంటున్నాం. కానీ వాళ్లు సానుకూలంగా స్పందించడం లేదు’ అని షహర్యార్ వ్యాఖ్యానించారు. సిరీస్ రద్దయితే న్యాయ సలహా కోరతామన్నారు. మరోవైపు సిరీస్ గురించి విదేశాంగ శాఖ సమాచారం కోసం వేచి చూస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో వెల్లడించారు. -
ఇండో-పాక్ సిరీస్ ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది
సచిన్ టెండూల్కర్ అభిప్రాయం న్యూయార్క్: భారత్, పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ రెండు దేశాల ప్రభుత్వాలపై ఆధారపడి ఉందని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. ఇరుదేశాల మధ్య మంచి వాతావరణం నెలకొనడానికి ఇది దోహదపడుతుందని భావిస్తే సిరీస్ కార్యరూపం దాల్చుతుందన్నారు. ‘ఓవరాల్‌గా సిరీస్ జరిగే అంశం రెండు దేశాల ప్రభుత్వాల చేతిలోనే ఉంది. జరగాలా, వద్దా నిర్ణయించేది వాళ్లే. దానికంటే ముందు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. సిరీస్ వల్ల మంచి జరుగుతుందని భావిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇది అవసరం లేదని రెండు ప్రభుత్వాలు భావిస్తే వాళ్లతో పాటే మనమూ వెళ్లాలి. అంతేకానీ మనం ఆడటం లేదనడానికి ఎలాంటి కారణం లేదు’ అని మాస్టర్ వెల్లడించారు. క్రికెట్‌ను ప్రపంచ వ్యాప్తం చేయాలనే లక్ష్యంతోనే ‘క్రికెట్ ఆల్‌స్టార్స్-2015’ టోర్నీని నిర్వహిస్తున్నామన్నారు. యువకులతో పాటు చాలా మందిని ఆటలోకి తీసుకురావాలన్నదే దీన్ని ఉద్దేశమన్నారు. ‘అమెరికా మహిళా క్రికెట్ జట్టుతో మేం ప్రాక్టీస్ చేస్తున్నాం. అలాగే చాలా మంది కుర్రాళ్లు మా ఆటను తిలకించేందుకు వస్తున్నారు. చాలా మంది దిగ్గజాలు ఈ టోర్నీకి ఆడుతున్నారు. కాబట్టి కుర్రాళ్లకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం. కలలను నెరవేర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎవరైనా కుర్రాడు రేపు అమెరికా తరఫున క్రికెట్ ఆడితే చాలా సంతోషిస్తా. వచ్చే ఏడాది మేం ఇక్కడికి వచ్చేసరికి కుర్రాళ్లు క్రికెట్ బ్యాట్లతో కనిపిస్తారని భావిస్తున్నా’ అని సచిన్ పేర్కొన్నారు. అమెరికాలోని ఇతర క్రీడలకు ఇది పోటీ కాదని మాస్టర్ స్పష్టం చేశారు. ఐసీసీ ప్రపంచకప్‌లో ఎక్కువ దేశాలకు ఆడే అవకాశం కల్పిస్తే క్రికెట్ ప్రపంచ వ్యాప్తమవుతుందని సూచించారు. -
జీవం పోసింది మనమే!
భారత్‌తోనే తొలి సిరీస్ ఆడిన దక్షిణాఫ్రికా ఏడు సార్లు పర్యటించిన సఫారీలు సొంతగడ్డపై మనదే పైచేయి వర్ణ వివక్ష కారణంగా దాదాపు రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్న దక్షిణాఫ్రికాను తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి తీసుకొచ్చింది భారత్. 1991లో సఫారీలను ఆహ్వానించి వన్డే సిరీస్ ఆడారు. ఈ 24 ఏళ్లలో భారత్‌లో ఏడుసార్లు దక్షిణాఫ్రికా జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడింది. సహజంగానే సొంతగడ్డపై బలమైన భారత్ ఆధిపత్యం ప్రదర్శించినా... సఫారీలు కూడా కొన్ని చిరస్మరణీయ విజయాలు సాధించారు. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మరో సిరీస్ నేపథ్యంలో... గత సిరీస్‌లను ఒక్కసారి పరిశీలిస్తే... 1991-92 (3 వన్డేలు) కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో పరిమితికి మించి రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా వచ్చిన ప్రేక్షకుల సమక్షంలో భారత్, దక్షిణాఫ్రికా తొలివన్డే జరిగింది. ఈ మ్యాచ్‌తో పాటు గ్వాలియర్‌లో జరిగిన రెండో వన్డేనూ గెలుచుకొని భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. అయితే న్యూఢిల్లీలో మూడో మ్యాచ్ గెలిచి బోణీ చేసిన ఆనందంతో దక్షిణాఫ్రికా వెనుదిరిగింది. హైలైట్స్: 22 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడింది. ఈ సిరీస్‌తో అలెన్ డొనాల్డ్లాంటి దిగ్గజ బౌలర్ వెలుగులోకి వచ్చాడు. ఫలితం: 2-1తో భారత్ సిరీస్ గెలిచింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్: సంజయ్ మంజ్రేకర్, కెప్లర్ వెసెల్స్. 1996-97 (3 టెస్టులు, వన్డే టోర్నీ) పూర్తి స్థాయి జట్టుతో దక్షిణాఫ్రికా తొలి సారి భారత పర్యటనకు వచ్చింది. అహ్మదాబాద్‌లో తొలి టెస్టులో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ శ్రీనాథ్ (6/21) ధాటికి కుప్పకూలి దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. అయితే కోల్‌కతాలో రెండో టెస్టులో ఆ జట్టు 329 పరుగులతో ఘనవిజయం సాధించింది. కానీ కాన్పూర్‌లో మాత్రం భారత్ 280 పరుగులతో గెలిచింది. ఫలితం: 2-1తో టెస్టు సిరీస్ భారత్ గెలిచింది. హైలైట్స్: 74 బంతుల్లో సెంచరీతో భారత రికార్డు సమం చేసిన అజహర్, వీవీఎస్ లక్ష్మణ్ అరంగేట్రం, కెరీర్ తొలి టెస్టులోనే క్లూస్‌నెర్ అద్భుత బౌలింగ్ (8/64) ప్రదర్శన. మ్యాన్ ఆఫ్ ద సిరీస్: అజహరుద్దీన్. వన్డే ప్రదర్శన: టైటాన్ కప్ ముక్కోణపు టోర్నీ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. 1999-2000 (2 టెస్టులు, 5 వన్డేలు) భారత్‌లో టెస్టు సిరీస్ గెలిచిన అరుదైన ఘనతను దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. 14 సిరీస్‌ల తర్వాత భారత్‌కు ఇది సొంతగడ్డపై తొలి ఓటమి. అయితే ఈ పర్యటనకు సంబంధించే మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం ఆ తర్వాత బయటపడటం దీనిని వివాదాస్పద సిరీస్‌గా మిగిల్చింది. ముంబైలో తొలి టెస్టులో 4 వికెట్లతో నెగ్గిన సఫారీలు, బెంగళూరులో జరిగిన రెండో టెస్టును ఇన్నింగ్స్, 71 పరుగులతో గెలుచుకున్నారు. హైలైట్స్: టెస్టు సిరీస్ ముగియగానే తాను కెప్టెన్సీనుంచి తప్పుకుంటానని నాలుగు రోజుల ముందు సచిన్ ప్రకటిం చడం సంచలనం సృష్టించింది. అజ హర్ పునరాగమనంతో పాటు కపిల్ కోచ్‌గా రావడమే కారణమని వార్తలు వచ్చాయి. సిరీస్‌లో నమోదైన ఏకైక సెంచరీ చేసిన అజహర్‌కు ఫిక్సింగ్ వివాదంతో రెండో టెస్టే ఆఖరిది అయింది. ఫలితం: 2-0తో సిరీస్ గెలిచిన దక్షిణాఫ్రికా మ్యాన్ ఆఫ్ ద సిరీస్: జాక్ కలిస్ వన్డే సిరీస్ ఫలితం: 3-2తో గెలిచిన భారత్ హైలైట్స్: సౌరవ్ గంగూలీ నాయకత్వంలో తొలిసారి భారత్ బరిలోకి దిగింది. చివరిదైన నాగపూర్ వన్డేలోనే క్రానే, బోయె, విలియమ్స్ ఫిక్సింగ్ చేసినట్లు కొద్ది రోజులకు ఢిల్లీ పోలీసులు బయట పెట్టారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్: సచిన్ టెండూల్కర్. 2004-05 (2 టెస్టులు) గిబ్స్, బోయెలను పోలీ సులు విచారించబోరని హామీ ఇస్తేనే సిరీస్ ఆడతామని మెలిక పెట్టిన దక్షిణాఫ్రికా చివరకు వారిద్దరినీ జట్టునుంచి తప్పించి భారత్‌కు వచ్చింది. కాన్పూర్‌లో తొలి టెస్టు నిస్సారమైన డ్రా కాగా, కోల్‌కతాలో రెండో టెస్టు భారత్ 8 వికెట్లతో గెలుచుకుంది. షెడ్యూల్ గందరగోళం కారణంగా వన్డేల నిర్వహణ సాధ్యం కాలేదు. సిరీస్ ఫలితం: 1-0తో భారత్ విజయం మ్యాన్ ఆఫ్ ద సిరీస్: వీరేంద్ర సెహ్వాగ్. 2005-06 (5 వన్డేలు) దక్షిణాఫ్రికా వన్డేల కోసం మ ళ్లీ భారత్‌కు వచ్చింది. వర్షం కారణంగా చెన్నై వన్డే రద్దుకాగా, ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు గెలిచాయి. హైలైట్స్: ఈ సిరీస్‌కు గంగూలీని తప్పించారనే ఆగ్రహంతో కోల్‌కతా వన్డేలో దాదాపు 80 వేల మంది ప్రేక్షకులు భారత జట్టుకు, కెప్టెన్ ద్రవిడ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రత్యర్థికి మద్దతు ఇచ్చారు. మ్యాచ్ తర్వాత కోచ్ గ్రెగ్ చాపెల్ మైదానం బయట వేలితో సంజ్ఞ చేయడం కొత్త వివాదాన్ని రేపింది. ఫలితం: 2-2తో సిరీస్ సమం. మ్యాన్ ఆఫ్ ద సిరీస్: గ్రేమ్ స్మిత్, యువరాజ్ సింగ్. 2007-08 (3 టెస్టులు) చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో డ్రాగా ముగిసింది. అహ్మదాబాద్‌లో రెండో టెస్టులో స్టెయిన్ (5/23) దెబ్బకు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే కుప్పకూలి మ్యాచ్‌ను ఇన్నింగ్స్, 90 పరుగులతో చేజార్చుకుంది. కాన్పూర్‌లో మూడో టెస్టును భారత్ 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. హైలైట్స్: కెరీర్లో రెండో ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్, ఈ ఘనత సాధించిన బ్రాడ్‌మన్, లారాల సరసన చేరాడు. కుంబ్లే గాయంతో కాన్పూర్ టెస్టుతో తొలిసారి ధోని భారత టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫలితం: 1-1తో సిరీస్ సమం మ్యాన్ ఆఫ్ ద సిరీస్: హర్భజన్ సింగ్. 2009-10 (2 టెస్టులు, 3 వన్డేలు) నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టును దక్షిణాఫ్రికా గెలుచుకోగా, కోల్‌కతాలో తర్వాతి మ్యాచ్‌ను గెలిచి భారత్ సిరీస్ సమం చేసింది. హైలైట్స్: ఆమ్లా 3 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 490 పరుగులు నమోదు చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు భారత ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, ధోని సెంచరీలు సాధించడం విశేషం. ఫలితం: 1-1తో టెస్టు సిరీస్ సమం; మ్యాన్ ఆఫ్ ద సిరీస్: హషీం ఆమ్లా వన్డే సిరీస్‌లో జైపూర్, గ్వాలియర్లలో తొలి రెండు మ్యాచ్‌లను భారత్ గెలుచుకోగా, అహ్మదాబాద్‌లో జరిగిన చివరి వన్డే దక్షిణాఫ్రికా వశమైంది. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ 58 బంతుల్లోనే సెంచరీ బాదాడు. హైలైట్స్: ప్రపంచ వన్డే చరిత్రలో తొలి డబుల్ సెంచరీ ఈ సిరీస్‌లోనే నమోదైంది. రెండో వన్డేలో సచిన్ 200 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితం: 2-1తో సిరీస్ భారత్ వశం మ్యాన్ ఆఫ్ ద సిరీస్: సచిన్ టెండూల్కర్. -
ద్వైపాక్షిక సిరీస్ గురించి అడగం: పీసీబీ
కరాచీ : తమతో ద్వైపాక్షిక సిరీస్ ఆడమని ఇక భారత్‌ను అడిగే ప్రసక్తే లేదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు. సిరీస్ గురించి చాలా రకాలుగా చెప్పి చూశామన్నారు. ‘డిసెంబర్లో జరగాల్సిన సిరీస్ గురించి ఇక అడగదల్చుకోలేదు. బంతి బీసీసీఐ కోర్టులో ఉంది. కాబట్టి సిరీస్ భవితవ్యాన్ని తేల్చాల్సింది వాళ్లే. మా వైపు నుంచి సాధ్యమైనంత వరకు ప్రయత్నించి చూశాం. కానీ స్పందన లేదు. అయితే మేం బీసీసీఐకి పంపిన లేఖకు ఏం జవాబు ఇస్తారో చూడాలని అనుకుంటున్నాం’ అని ఖాన్ పేర్కొన్నారు. ఈ సిరీస్‌లో భారత్ ఆడకపోతే అవసరమైనప్పుడు ఐసీసీతో ఈ విషయాన్ని చర్చిస్తామన్నారు. క్రికెట్, రాజకీయాలను కలిపి చూడొద్దని ఇప్పటికీ తాము స్పష్టంగా చెబుతున్నామని ఖాన్ తెలిపారు. ‘గతంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా క్రికెట్ ఆడాం. కానీ 2007 నుంచి భారత్ మాతో ఒక్క టెస్టు కూడా ఆడలేదు. అయినప్పటికీ మేం వాళ్ల వెంట పరుగెత్తలేదు. ద్వైపాక్షిక సిరీస్‌కు ఉన్న ప్రాముఖ్యతను బట్టి వాటిని పునరుద్ధరించాలని మాత్రం అడిగాం’ అని ఖాన్ వ్యాఖ్యానించారు. -
ద్వైపాక్షిక సిరీస్ ఆడతారా.. లేదా!
బీసీసీఐకి పీసీబీ లేఖ న్యూఢిల్లీ: ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్లో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడతారో లేదో తెలపాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. బీసీసీఐకి ఓ లేఖ రాసింది. ఐసీసీ ఎఫ్టీపీ పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేసిన పీసీబీ షెడ్యూల్‌ను ఖరారు చేయాలని కోరింది. ఇరుదేశాల మధ్య రాజకీయ భేదాభిప్రాయాలు ఎప్పుడూ ఉండేవేనని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నారు. ‘రాజకీయ ఒత్తిడిలు కొనసాగుతూనే ఉంటాయి. వాటిని క్రికెట్‌తో ముడిపెట్టొద్దు. ఇరుదేశాల మధ్య శాంతిని స్థాపించడానికి క్రికెట్ ఓ సాధనంగా ఉపయోగపడుతుంది’ అని ఖాన్ పేర్కొన్నారు. 2015 నుంచి 2023 వరకు పాక్‌తో ఆరుసార్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలని గతంలో బీసీసీఐ, పీసీబీల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఇటీవల పాక్‌తో తలెత్తున్న సమస్యల వల్ల ప్రస్తుతానికి సిరీస్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోడం లేదు. సిరీస్ జరగాలంటే హోంశాఖ క్లియరెన్స్ అవసరం కావడం, టీవీ హక్కుల విషయంలో ఇరుదేశాల మధ్య అవగాహన కుదరకపోవడంతో సిరీస్ అంశం మరుగునపడింది. -
విండీస్ బోర్డులో కలవరం!
బీసీసీఐతో సమావేశమవ్వాలని నిర్ణయం బార్బడోస్: బీసీసీఐ పెద్దరికం, అధికారం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ)ను కలవరపెట్టినట్లున్నాయి. భారత బోర్డుతో ఢీకొంటే మనుగడ సాగించలేమని కూడా వారికి అర్థమైంది. పర్యటనలు రద్దు, భారీ పరిహారంలాంటి నిర్ణయాలతో ఉలిక్కి పడ్డ డబ్ల్యూఐసీబీ భారత క్రికెట్ బోర్డును ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. బీసీసీఐతో వెంటనే ప్రత్యేకంగా సమావేశం కావాలని విండీస్ బోర్డు నిర్ణయించింది. సిరీస్ నుంచి నిష్ర్కమణవంటి పరిణామాలు దురదృష్టకరమని పేర్కొంటూ నష్టనివారణకు సిద్ధమైంది. మంగళవారం ఇక్కడ ఎనిమిది గంటల పాటు జరిగిన సమావేశంలో డబ్ల్యూఐసీబీ సుదీర్ఘంగా చర్చించింది. స్నేహం కొనసాగాలి... సమావేశం అనంతరం విండీస్ బోర్డు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘సిరీస్‌నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం బోర్డును చాలా ఇబ్బంది పెట్టింది. జరిగిన పరిణామాలపై విచారణ జరిపేందుకు కీలక సభ్యులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న మంచి సంబంధాల నేపథ్యంలో... బీసీసీఐతో సమావేశం కావాలని భావిస్తున్నాం. విండీస్‌పై తీవ్ర ప్రభావం చూపే భారత బోర్డు నిర్ణయాలపై ఆ సమావేశంలో చర్చిస్తాం. జరిగిన నష్టాన్ని పూరించేందుకు పరిష్కార మార్గం లభిస్తుందని భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాం. కీలక సమయంలో సంయమనంగా వ్యవహరించిన ఐసీసీ, బీసీసీఐ, ప్రసారకర్తలు, స్పాన్సర్లకు మా కృతజ్ఞతలు. భారత బోర్డుతో పాత స్నేహం కొనసాగుతుందని నమ్ముతున్నాం’ అని డబ్ల్యూఐసీబీ ఆ ప్రకటనలో తెలిపింది. దీనిపై బీసీసీఐ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. విండీస్ బోర్డుపై ఐసీసీ చర్యలు! భారత పర్యటననుంచి వెస్టిండీస్ జట్టు అర్ధాంతరంగా వైదొలగిన వ్యవహారంపై ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకోనుంది. నవంబర్ 10న జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని చర్చిస్తారు. ‘సామరస్య పద్ధతిలోనే దీనికి పరిష్కారం కనుగొంటాం’ అని ఐసీసీ తన మీడియా ప్రకటనలో పేర్కొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వెస్టిండీస్ జట్టును ఐసీసీ సస్పెండ్ చేయాలనే ప్రతిపాదన ఉంది. దీంతో పాటు 2015 వన్డే ప్రపంచకప్‌లో విండీస్‌కు దక్కాల్సిన పార్టిసిపేషన్ ఫీజును బీసీసీఐకి బదలాయించవచ్చు. అయితే ఇది ద్వైపాక్షిక సిరీస్ కావడంతో బీసీసీఐ అభ్యర్థన మేరకే ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.