Asia Cup 2022 Will Commence In The United Arab Emirates On 27 Aug 2022 - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: ‘ఆసియా’ అందుకునేందుకు..

Published Sat, Aug 27 2022 5:19 AM | Last Updated on Sat, Aug 27 2022 11:42 AM

Asia Cup 2022 will commence in the United Arab Emirates on 27 aug 2022 - Sakshi

PC: ACC

దుబాయ్‌: టి20 ప్రపంచ కప్‌కు ముందు ఈ ఫార్మాట్‌లో ఉపఖండపు ప్రధాన జట్లు సన్నాహకానికి సన్నద్ధమయ్యాయి. ద్వైపాక్షిక సిరీస్‌లు కాకుండా కొంత విరామం తర్వాత భారత జట్టు కూడా రెండుకంటే ఎక్కువ జట్లు ఉన్న టోర్నీలో బరిలోకి దిగుతోంది. దాంతో ఆసియా కప్‌ టోర్నమెంట్‌ ఆసక్తికరంగా మారింది. ఆతిథ్యం ఇవ్వాల్సిన శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో చేతులెత్తేయడంతో చివరి నిమిషంలో వేదిక యూఏఈకి మారింది.

తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే ఈ సమయంలో ఆటగాళ్లకు ఇది కూడా సవాల్‌. టి20 ప్రపంచ కప్‌ జరిగే ఆస్ట్రేలియాతో పోలిస్తే పిచ్‌లు, పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం ఉన్నా, తమ ఆటగాళ్లను పరీక్షించుకునేందుకు అన్ని జట్లూ ప్రయత్నిస్తాయి. భారత్, పాకిస్తాన్‌ మధ్య కనీసం రెండు మ్యాచ్‌లతో పాటు మరో మ్యాచ్‌ కూడా జరిగే అవకాశం ఉండటంతో టోర్నీ పై అభిమానుల ఆసక్తి మరింత పెరిగేలా చేసింది. 2020లో జరగాల్సిన టోర్నీ కోవిడ్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చి రెండేళ్లు ఆలస్యంగా జరుగుతోంది.  

జట్ల వివరాలు: (గ్రూప్‌ ‘ఎ’)భారత్, పాకిస్తాన్, హాంకాంగ్‌.  
(గ్రూప్‌ ‘బి’) శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌.  

ఫార్మాట్‌: తమ గ్రూప్‌లోని రెండు జట్లతో ఆడిన అనంతరం టాప్‌–2 టీమ్‌లు ముందంజ వేస్తాయి. అక్కడ మిగిలిన మూడు టీమ్‌లతో తలపడాల్సి ఉంటుంది. టాప్‌–2 జట్లు ఫైనల్‌కు చేరతాయి. ఐదు టీమ్‌లు నేరుగా టోర్నీలో అడుగు పెట్టగా, క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా హాంకాంగ్‌ అర్హత సాధించింది. దుబాయ్, షార్జాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్‌ 11న ఫైనల్‌ నిర్వహిస్తారు.  

టోర్నీ చరిత్ర: ఆసియా కప్‌ను ఇప్పటి వరకు 14 సార్లు నిర్వహించారు. 1984–2018 మధ్య ఈ టోర్నమెంట్‌లు జరిగాయి. అత్యధికంగా 7 సార్లు భారత్‌ విజేతగా నిలవగా, శ్రీలంక 5 సార్లు టోర్నీ గెలిచింది. పాకిస్తాన్‌ 2 సార్లు ట్రోఫీని అందుకుంది.   

డిఫెండింగ్‌ చాంపియన్‌గా భారత్‌ బరిలోకి దిగుతోంది. 2018లో వన్డే ఫార్మాట్‌లో జరిగిన టోర్నీలో రోహిత్‌ శర్మ నాయకత్వంలోనే టీమిండియా టైటిల్‌ సాధించింది. 2016లో కూడా ప్రపంచకప్‌కు కొద్ది రోజుల ముందు ఈ టోర్నీని టి20 ఫార్మాట్‌లోనే నిర్వహించారు. 
చదవండి: IND vs PAK Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌.. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు రోహిత్‌ డుమ్మా; కేఎల్‌ రాహుల్‌ ఏమన్నాడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement