షహర్యార్ నిరాశ
కరాచీ: ఓ చిన్న సిరీస్ ద్వారా భారత్, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ పునరుద్దరించాలన్న ఆశలు అడుగంటిపోతున్నాయని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ అన్నారు. ఇక సిరీస్ నిర్వహించేందుకు సమయం కూడా సరిపోదని స్పష్టం చేశారు. ‘ఓ సమావేశం కోసం ఇస్లామాబాద్ వచ్చిన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా సిరీస్ పునరుద్ధరణకు సాయం చేయలేకపోయారు.
అలాగే లంకలో చిన్న సిరీస్ నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చదని సంకేతాలిచ్చారు. సుష్మా రాకతో పరిస్థితిలో కొంతైనా మార్పు వస్తుందని భావించాం. కానీ అది సాధ్యపడలేదు. మేం భారత్‌తో ఆడాలనుకుంటున్నాం. కానీ వాళ్లు సానుకూలంగా స్పందించడం లేదు’ అని షహర్యార్ వ్యాఖ్యానించారు. సిరీస్ రద్దయితే న్యాయ సలహా కోరతామన్నారు. మరోవైపు సిరీస్ గురించి విదేశాంగ శాఖ సమాచారం కోసం వేచి చూస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో వెల్లడించారు.
ఇండో-పాక్ సిరీస్ కష్టమే
Published Thu, Dec 10 2015 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM
Advertisement