IND VS ENG 4th Test: ఓటమి ఎరుగని హిట్‌మ్యాన్‌ | IND VS ENG 4th Test: Rohit Sharma Is Yet To Lose A Bilateral Test Series As Captain | Sakshi
Sakshi News home page

IND VS ENG 4th Test: ఓటమి ఎరుగని హిట్‌మ్యాన్‌

Published Mon, Feb 26 2024 8:24 PM | Last Updated on Mon, Feb 26 2024 8:31 PM

IND VS ENG 4th Test: Rohit Sharma Is Yet To Lose A Bilateral Test Series As Captain - Sakshi

ద్వైపాక్షిక టెస్ట్‌ సిరీస్‌ల్లో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ జైత్రయాత్ర కొనసాగుతుంది. సుదీర్ఘ ఫార్మాట్‌ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో హిట్‌మ్యాన్‌ ఇప్పటివరకు ఓటమనేది ఎరుగడు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ప్రస్తానం 2021-22 శ్రీలంక సిరీస్‌తో (స్వదేశంలో 2-0 తేడాతో టీమిండియా గెలిచింది) మొదలైంది. అప్పటి నుంచి హిట్‌మ్యాన్‌ సారథ్యంలో టీమిండియా ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌ కూడా కోల్పోలేదు. 

శ్రీలంక సిరీస్‌ తర్వాత రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా.. ఆస్ట్రేలియాపై (స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో), వెస్టిండీస్‌పై (వెస్టిండీస్‌పై వారి దేశంలో 1-0 తేడాతో), తాజాగా ఇంగ్లండ్‌పై (స్వదేశంలో ఇంగ్లండ్‌పై 3-1 తేడాతో, మరో టెస్ట్‌ మిగిలి ఉంది) వరుస సిరీస్‌ విజయాలు సాధించింది.  మధ్యలో సౌతాఫ్రికా సిరీస్‌ (వారి దేశంలోనే) ఒక్కటి డ్రాగా (1-1) ముగిసింది. 

ఇదిలా ఉంటే, రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ గెలుపుతో స్వదేశంలో టీమిండియా విజయపరంపర మరింత మెరుగుపడింది. సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర 11 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో భారత జట్టు స్వదేశంలో రికార్డు స్థాయిలో 17 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించింది. 

2013 ఫిబ్రవరిలో మొదలైన టీమిండియా జైత్రయాత్ర ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌ వరకు అప్రతిహతంగా సాగుతుంది. ప్రపంచంలో ఏ జట్టు స్వదేశంలో వరుసగా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించలేదు. భారత్‌ తర్వాత అత్యధికంగా ఆస్ట్రేలియా రెండుసార్లు (1994-2001, 2004-2008) స్వదేశంలో వరుసగా 10 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. భారత్‌, ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్‌ (1976-1986), న్యూజిలాండ్‌ (2017-2021) జట్లు స్వదేశంలో 8 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించాయి.

నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ స్కోర్‌ వివరాలు.. 

  • ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 353 (రూట్‌ 122 నాటౌట్‌, జడేజా 4/67)
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 307 (దృవ్‌ జురెల్‌ 90, షోయబ్‌ బషీర్‌ 5/119)
  • ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 145 (జాక్‌ క్రాలే 60, అశ్విన్‌ 5/51)
  • భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 192/5 (రోహిత్‌ శర్మ 55, షోయబ్‌ బషీర్‌ 3/79)
  • 5 వికెట్ల తేడాతో భారత్ విజయం
  • ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: దృవ్‌ జురెల్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement