ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడతారో లేదో తెలపాలని పాక్ క్రికెట్ బోర్డు.....
బీసీసీఐకి పీసీబీ లేఖ
న్యూఢిల్లీ: ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడతారో లేదో తెలపాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. బీసీసీఐకి ఓ లేఖ రాసింది. ఐసీసీ ఎఫ్‌టీపీ పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేసిన పీసీబీ షెడ్యూల్‌ను ఖరారు చేయాలని కోరింది. ఇరుదేశాల మధ్య రాజకీయ భేదాభిప్రాయాలు ఎప్పుడూ ఉండేవేనని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నారు. ‘రాజకీయ ఒత్తిడిలు కొనసాగుతూనే ఉంటాయి. వాటిని క్రికెట్‌తో ముడిపెట్టొద్దు.
ఇరుదేశాల మధ్య శాంతిని స్థాపించడానికి క్రికెట్ ఓ సాధనంగా ఉపయోగపడుతుంది’ అని ఖాన్ పేర్కొన్నారు. 2015 నుంచి 2023 వరకు పాక్‌తో ఆరుసార్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలని గతంలో బీసీసీఐ, పీసీబీల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఇటీవల పాక్‌తో తలెత్తున్న సమస్యల వల్ల ప్రస్తుతానికి సిరీస్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోడం లేదు. సిరీస్ జరగాలంటే హోంశాఖ క్లియరెన్స్ అవసరం కావడం, టీవీ హక్కుల విషయంలో ఇరుదేశాల మధ్య అవగాహన కుదరకపోవడంతో సిరీస్ అంశం మరుగునపడింది.