ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) డ్రాప్ట్ షెడ్యూల్‌ను ఐసీసీ సమర్పించింది. అయితే ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్‌పై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ మెగా టోర్నీలో ఆడేందుకు భారత జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తమ నిర్ణయాన్ని బీసీసీఐ పెద్దలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గతడేది ఆసియాకప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. పాక్ బదులుగా భారత్ ఆడే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
కాగా ఆసియాకప్-2023 కూడా హైబ్రిడ్ పద్ధతిలో జరిగింది. ఇతర దేశాలు పాకిస్తాన్‌కు వెళ్లి ఆడగా.. భారత్ మాత్రం తమ మ్యాచ్‌లు అన్నింటిని శ్రీలంకలో ఆడింది.
"ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్ వెళ్లే సూచనలు కన్పించడం లేదు. అయితే ఈ విషయంపై తుది నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకవేళ భారత్.. పాక్‌కు వెళ్లకపోతే హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ జరగనుంది.
ఆసియా కప్ మాదిరిగానే భారత్ తమ మ్యాచ్‌లను యూఏఈ లేదా శ్రీలంకలో ఆడే అవకాశముంది. ఐసీసీ కూడా ప్రస్తుతం ఇదే విషయంపై దృష్టి పెట్టింది. అయితే, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి" అంటూ బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా, 2008 అనంతరం పాకిస్థాన్ పర్యటనకు భారత్ ఇప్పటివరకు వెళ్లలేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దృష్ట్యా భారత జట్టును పాక్‌కు బీసీసీఐ పంపడం లేదు. ఇరు జట్ల మధ్య ద్వైఫాక్షిక సిరీస్‌లు కూడా జరగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment