బీసీసీఐ డిమాండ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు తలొగ్గింది. ఛాంపియన్స్ ట్రోఫీ- 2025ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడనుంది.
టీమిండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పీసీబీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో చర్చించినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ రిపోర్ట్స్ ప్రకారం.. గురువారం(డిసెంబర్ 5) సాయంత్రం బోర్డు మీటింగ్ అనంతరం ఐసీసీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.
ఐసీసీ కొత్త చైర్మెన్‌గా ఎన్నికైన జైషా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లోఎ మొత్తం 15 దేశాల క్రికెట్ బోర్డుల ప్రతినిధులు పాల్గోనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినప్పటికి బీసీసీఐకి కొన్ని షరతులు విధించింది.
రాబోయే కాలంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్‌లను కూడా ఇదే హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని పీసీబీ కోరింది. కానీ బీసీసీఐ మాత్రం అందుకు సున్నితంగా తిరష్కరించింది.
అదేవిధంగా హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకపోతే టోర్నీని వేరే చోటకు తరలిస్తామని పీసీబీకి ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment