Tenth class Board
-
శరవేగంగా ‘పది’కి ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ నెల 23 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను ప్రభుత్వం 31వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న మార్పులపై ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో శిక్షణ కల్పించిన విద్యాశాఖ అధికారులు పరీక్షల విధి నిర్వహణలో పాటించాల్సిన నియమ, నిబంధనలపై జిల్లాలోని ఐదు విద్యాశాఖ డివిజన్ల వారీగా చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులకు అవగాహన కల్పించారు. దీంతో పాటు ఐదు డివిజన్ల వారీగా సమీక్షా సమావేశాలను సైతం పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని 1,041 ఉన్నత పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరు కానున్న 60,042 మంది విద్యార్థులకు 269 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి కేంద్రీకరించారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులనే నియమించేందుకు చర్యలు చేపట్టారు.సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమించడంతో పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులను ఒక్కో కేంద్రానికి ఒకరి చొప్పున పర్యవేక్షణకునియమిస్తున్నారు. 3,000 మంది ఇన్విజిలేటర్లు పదో తరగతి పరీక్షల విధులకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మూడు వేల మంది ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించేందుకు చర్యలు చేపట్టారు. ఇన్విజిలేటర్లుగా నియమించే క్రమంలో సీనియారిటీతో పాటు గతంలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏ మండలంలో పని చేస్తున్న ఉపాధ్యాయులను అదే మండలంలోని పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్లుగా నియమించాలని ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రతి మండల పరిధిలోని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఇన్విజిలేటర్ల మొత్తం సంఖ్యను పరిగణలోకి తీసుకుని, అవసరమైతేనే పక్క మండలాల్లోని ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది మండల పరిధిలోని ఇన్విజిలేటర్ల సంఖ్యలో ఐదు శాతానికి మించకూడదని స్పష్టం చేశారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీసుతో పాటు అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా ఇన్విజిలేటర్లను ప్రతి మూడురోజులకోసారి జంబ్లింగ్ విధానంలో ఇతర పరీక్షా కేంద్రాలకు పంపనున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ జిల్లాకు చేరవేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. విద్యార్థుల హాల్ టికెట్లను పరీక్షలకు వారం రోజుల ముందుగా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎదురు చూపులేనా?
సాక్షి, కడప : పదవ తరగతి పరీక్షల్లో కార్పొరేట్ అక్రమాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రశ్నపత్రంలో సమూలు మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న 20 శాతం అంతర్గత మార్కులను రద్దు చేసి దానిస్థానంలో ఏకవాక్య ప్రశ్నలు పెట్టనుంది. ఫలితంగా అక్రమాలకు కొంత అడ్డుకట్ట పడనుంది. విద్యార్థుల సమార్థ్యాల మేరకు ప్రశ్నాపత్రం ఉండబోతోందని చర్చసాగుతోంది. అది కూడా వంద మార్కుల ప్రశ్నపత్రం రూపుదిద్దుకుంటున్నట్లుగా తెలిసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలులోకి తీసుకొచ్చేందుకు విద్యాశాకాధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎస్సీఈఆర్టీ పది నమూనా ప్రశ్నపత్రాన్ని విడుదల చేయలేదు. దీంతో ప్రశ్నాపత్రం ఏవిధంగా ఉంటుందోనని విద్యార్థులు వారి తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీరితోపాటు నమూనా ప్రశ్నాపత్రం కోసం జిల్లావ్యాప్తంగా దాదాపు 38 వేలమంది విద్యార్థులు ఎదురు చేస్తున్నారు. పైగా నవంబర్ మొదటి వారంలో సమ్మెటీవ్– 1 పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన సిలబస్ కానీ మాదిరి ప్రశ్నపత్రాలను కానీ పంపలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 100 మార్కుల ప్రశ్నపత్రం.. జిల్లావ్యాప్తంగా ప్రతి ఏటా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 38 వేల మంది దాకా విద్యార్థులు పది పరీక్షలను రాస్తున్నారు. అయితే గ్రేడింగ్‌ల సాధనలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ముందు వరుసలో ఉంటున్నారు. అంతర్గత మార్కులు పాఠశాల యాజమాన్యాలు వేసుకునే వెసలుబాటు ఉన్న నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యాలతో పనిలేకుండా ర్యాంకుల కోసమని అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గత పాలకులు కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించగా వారు సాగించిన వ్యవహారంతో విద్యాశాఖ భ్రష్టుపట్టింది. రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్టిని సారించి ప్రక్షాళన చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్షల నిర్వహణలో సమూల మార్పులను చేపట్టారు. అంతర్గత మార్కులను రద్దు చేసి ఇక నుంచి వంద మార్కులతో కూడిన ప్రశ్నాపత్రం విద్యార్థులకు ఇవ్వనున్నారు. బిట్ పేపర్ కూడా రద్దుకానుంది. దానిస్థానంలో ఏకవాక్య సమాధానాలు రాసే విధంగా ప్రశ్నలు ఇవ్వనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన నమూనా పేపర్‌ను మాత్రం ఎస్సీఈఆర్టీ ఇంత వరకు ఇలా ఉంటుందని మాత్రం నమూనా ప్రత్రాన్ని విడుదల చేయలేదు. దీంతో సిలబస్ ఎలా ఉం టుందో.. పిల్లలకు ఎంతమేరకు బోధనలు అం దించాలి అనే దానిపై ఉపాధ్యాయులకు కూడా స్పష్టత లేదు. దీంతో అటు విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. రెండు పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించాల్సిందే.. పదవ తరగతిలో ఇప్పటి వరకు రెండు పేపర్లలో కలిసి ఆయా సబ్జెక్టుల్లో 35 మార్కులు సాధిస్తే విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేవారు. ఒక దానిలో సున్నా మార్కులు వచ్చినా రెండో పేపర్లో 35 మార్కులు వస్తే ఆ సబ్జెక్టు 35 మార్కులు వస్తే ఆ సబ్జెక్టు పాస్ అయినట్లుగా పరిగణించేవారు. ఇక నుంచి రెండు పేపర్లలోనూ నిర్ణయించిన మార్కులు వస్తేనే ఉత్తీర్ణత సాధించినట్లుగా మార్పులు చేసినట్లు తెలిసిందే. అంటే 50 మార్కులకుగాను ఒకొక్క పేపర్లో 17.5 మార్కులు ఖచ్చితంగా రావాల్సిందేనని సూచించారు. ఇందుకు సంబంధించి సిలబస్, నమూనా ప్రశ్నాపత్రం ఇలా ఉంటుందని మాత్రం ఇంతరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలు గడిచినా.. పదవ తరగతి అంతర్గత మార్కులను రద్దు పరుస్తూ మార్చి 2020 సంవత్సరంలో కొత్త పద్దతిలో పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యా కమీషనర్ జూన్ నెలలో ప్రకటించారు. పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు అయినప్పటికీ కొత్త మోడల్ పేపర్ ప్రకటించకపోవడం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పనితీరుకు నిదర్శనం. నవంబర్ మొదటి వారంలో నిర్వహించే సమ్మెటీవ్ పరీక్షా ప్రతాలు ఏ మాదిరిగా ఉంటాయో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే నూతన మోడల్ పేపర్ మరియు బ్లూ ఫ్రింట్ ప్రకటించాలి. – జీవీ నారాయణరెడ్డి, డీసీఈబీ సెక్రటరీ, కడప -
సీబీఎస్ఈ పదో తరగతికీ బోర్డు పరీక్ష తప్పనిసరి!
ఆప్షనల్ విధానం తొలగింపు 2017–18 నుంచి అమలు సీబీఎస్ఈ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ సిలబస్ స్కూళ్ల లో ఇన్నాళ్లు ఆప్షనల్‌గా ఉన్న పదో తరగతి బోర్డు పరీక్ష విధానం ఇక నుంచి తప్పనిసరి కానుంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలో స్కూళ్లలో పదో తరగతిలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆప్ష నల్ విధానాన్ని కేంద్రం తొలగించింది. రాష్ట్ర సిలబస్‌లోని పదో తరగతి పరీక్షల తరహా విధానాన్ని సీబీఎస్ఈ స్కూళ్లలోనూ అమలు చేయనుంది. దాంతో 2017–18 నుంచి సీబీఎస్ఈ స్కూళ్ల పదోతరగతి విద్యార్థులంతా బోర్డు పరీక్షకు హాజరు కావాల్సిందే. ఇన్నాళ్లు సీబీఎస్ఈ స్కూళ్లలోని టెన్త్ విద్యార్థులు కావాలనుకుంటే బోర్డు పరీక్షకు హాజరు కావచ్చు. లేదా అదే పాఠశాలలో 11వ తరగతి చదవాలనుకుంటే ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా 11వ తరగతికి వెళ్లిపోవచ్చు. ఇంటర్లో చేరాలనుకునే సీబీ ఎస్ఈ స్కూళ్ల విద్యార్థులే ఎక్కువగా బోర్డు పరీక్షలు రాసేవారు. కానీ 2017–18 నుంచి అలా కుదరదు. వారంతా బోర్డు పరీక్షలు రాసి పాసవాల్సిందే. ఈ మేరకు పదో తరగతి కొత్త పరీక్ష విధానంపై సీబీఎస్ఈ చైర్మన్ ఆర్కే చతుర్వేది మంగళ వారం ఉత్వరులు జారీ చేశారు. పదో తరగతి కొత్త పరీక్షల విధా నం పై వివరాలతో కూడిన ఉత్తర్వులను దేశంలోని అన్ని సీబీఎస్ఈ స్కూళ్లకు పంపారు. 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చే మార్చి 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు మాత్రం పాత విధానమే వర్తిస్తుందని ఆయన వివరించారు. ఇదీ పరీక్షల విధానం... ► కొత్త విధానంలో ప్రతి సబ్జెక్టులో 100 మార్కులుంటాయి. 80 మార్కులు రాత పరీ క్షకు, 20 ఇంటర్నల్ అసెస్మెంట్కు ఇస్తారు. వీటిల్లో ఒక్కోదాంట్లో 33% మార్కులు సాధించాలి. ఇంటర్నల్స్‌లో పీరియాడిక్ టెస్టు లకు 10 మార్కులు, నోట్ బుక్ సబ్మిషన్, అసైన్మెంట్ల పూర్తి, నోటు బుక్ నీట్నెస్కు 5 మార్కులు, వినడం, రాయడం, చదవడం, ప్రాక్టికల్స్, ప్రాజెక్టు వంటి నైపుణ్యాలకు 5 మార్కులుంటాయి. పీరియాడిక్ టెస్టులను ఒక విద్యా సంవత్సరంలో 3 కంటే ఎక్కువ నిర్వహించకూడదు. వాటిల్లో ఉత్తమమైన రెండింటిని పరిగణనలోకి తీసుకోవాలి. ► ఇప్పటిదాకా ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా 11వ తరగతికి ప్రమోట్ చేసే పద్ధతిలో జూన్ నుంచి సెప్టెంబరు వరకు పూర్తయిన సిలబస్, విద్యార్థి మార్కులు, పనితీరు ఆధా రంగా ప్రమోట్ చేసేవారు. అక్టోబరు నుంచి ఫిబ్రవరి దాకా బోధించిన సిలబస్‌లోనే బోర్డు పరీక్ష నిర్వహించే వారు. ఇకపై 2017–18 నుంచి అమల్లోకి వచ్చే బోర్డు పరీక్షలో 100 % సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. 12వ తరగతిలో ఉన్నట్లే 9 పాయింట్ల గ్రేడింగ్ విధానం ఉంటుంది. కో కరిక్యులర్ యాక్టివి టీస్‌కు 5 పాయింట్ల గ్రేడింగ్ విధానం కొన సాగుతుంది. పదో తరగతి అసెస్మెంట్ విధానాన్నే ఆరు నుంచి తొమ్మిదో తరగతి దాకా కూడా అమలు చేస్తారు.