తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్, ఏపీ సెట్స్) ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి ...
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్, ఏపీ సెట్స్) ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ సభ్య కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు... వచ్చే ఏడాది జనవరి 4 జరిగే సెట్‌కు అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.100 అపరాధ రుసుముతో నవంబరు 1 నుంచి 8 వరకు, రూ.200 అపరాధ రుసముతో 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 27 సబ్జెక్టులకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నాయి. రెగ్యులర్, దూరవిద్యలో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు సెట్‌కు అర్హులు. కాగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)ను ఇక నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) చేపట్టనునట్లు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.