
నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఈ నెల 3న ఆఫ్‌లైన్‌లో, 9, 10 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఈ నెల 27న విడుదల చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టింది. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఫలితాల లింక్‌ను జేఈఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ స్కోర్ ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే టాప్ 2 లక్షల మందిని ఎంపిక చేయనుంది. ఈ నెల 29 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు గువాహటి ఐఐటీ చర్యలు చేపట్టింది.