26 లేదా 27న ర్యాంకులు?
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకుల ప్రకటన వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 24న ర్యాంకులను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ప్రకటించాల్సి ఉన్నప్పటికీ వాటిని వాయిదా వేసింది. ఈనెల 25 వరకు వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డులు, విద్యార్థుల ఇంటర్మీడి యెట్/12వ తరగతి ఫలితాల సమాచారాన్ని అందజేయాలని బుధవారం ప్రకటన జారీ చేసింది.
25లోగా ఫలితాల సమాచారం ఇవ్వని బోర్డులకు చెందిన విద్యార్థులకు ర్యాంకులు ఇవ్వడం కుదరదని, ఇందుకు తాము బాధ్యులం కాబోమని స్పష్టం చేసింది. తాజా ప్రకటన నేపథ్యంలో ఆల్ ఇండియా ర్యాంకులు ఈనెల 26 లేదా 27న వెల్లడించే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ప్రకటన వాయిదా పడిన నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఉమ్మడి ప్రవేశాలకు నిర్వహించాల్సిన ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్లను ప్రక్రియ కూడా వాయిదా పడింది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనే విషయాన్ని ఈనెల 26న ప్రకటిస్తామని జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటి వెల్లడించింది.
జేఈఈ మెయిన్ ర్యాంకుల ప్రకటన వాయిదా
Published Thu, Jun 25 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM
Advertisement