ఆందోళన వద్దు.. ఆప్షన్ మార్చుకోండి
- ‘జేఈఈ’పై తెలంగాణ ఇంటర్ బోర్డుకు సీబీఎస్‌ఈ లేఖ
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో సవరణ గడువు నేటితో (ఈనెల 31తో) ముగిసినా.. విద్యార్థులు ఆందోళన చెందవద్దని, వీలైతే ఇప్పుడు తెలంగాణ ఇంటర్ బోర్డుకు సంబంధించిన ఆప్షన్‌ను అదర్స్‌లో మార్పు చేసుకోవాలని, వీలుకాకపోయినా ఇబ్బందేమీ లేదని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తెలంగాణ ఇంటర్ బోర్డుకు తెలియజేసింది. ఈమేరకు తెలంగాణ ఇంటర్ బోర్టుకు శుక్రవారం లేఖ రాసింది.
జేఈఈ ర్యాంకుల ఖరారు కోసం ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి విద్యార్థుల మార్కుల జాబితా తమకు వచ్చినప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులుగా సవరణ చేసి, తుది ర్యాంకులను ఖరారు చేస్తామన్నారు. జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో తెలంగాణ ఇంటర్ బోర్డు ఆప్షన్ లేకపోవడం, సవరణల లింక్‌లోనూ తెలంగాణ బోర్డు ఆప్షన్ లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో పడిన సంగతి తెలిసిందే.