జేఈఈ మెయిన్‌ సిటీ ఇంటిమేషన్‌ లెటర్లు విడుదల | JEE Main City Intimation Letters Released | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్‌ సిటీ ఇంటిమేషన్‌ లెటర్లు విడుదల

Published Mon, Apr 3 2023 5:34 AM | Last Updated on Mon, Apr 3 2023 9:41 AM

JEE Main City Intimation Letters Released - Sakshi

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ –2023 సెకండ్‌ సెషన్‌ పరీ­క్షలకు సిటీ ఇంటిమేషన్‌ లెటర్లను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. విద్యా­ర్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ https:// jee main. nta.nic.in/' నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవా­లని సూచిం­చింది. మెయిన్‌ సెకండ్‌ సెషన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయి.

దేశవ్యాప్తంగా 290 పట్టణాలతో పాటు విదేశాల్లోని 24 పట్టణాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఏపీలో 25 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్‌టీఏ ఏర్పాటుచేసింది. విద్యా­ర్థులు ఏ పట్టణంలో పరీక్ష రాయాలో తెలి­య­జేసేలా ఎన్‌­టీఏ ఈ సిటీ ఇంటిమేషన్‌ లెటర్లను ముందుగా విడుదల చేస్తుంది. విద్యార్థులు ముందుగా ఆయా కేంద్రాలను సందర్శించి, పరీక్షల రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి చేరుకోవడానికి వీలుగా ఈ ఏర్పాట్లు  చేసింది.

విద్యార్థులు వారి దర­ఖాస్తు నంబరు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా సిటీ ఇంటి­మేషన్‌ లెటర్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసు­కోవచ్చు. ఈ లెటర్లతో పరీక్ష కేంద్రాల్లోకి అనుమ­తించరు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశానికి అడ్మిట్‌ కార్డులు జారీ చేస్తారు. వీటిని కూడా త్వరలోనే ఎన్‌టీఏ విడుదల చేయనుంది. డౌన్‌లోడ్‌లో సమస్యలు ఏర్పడితే 011–40759000 ఫోన్‌ నెంబర్లో లేదా "jeemain@nta.ac.in.' ఈమెయిల్‌ ద్వారా సంప్రదించాలని ఎన్‌టీఏ సూచించింది. విద్యార్థులు ఎన్‌టీఏ అధికారక వెబ్‌సైట్లలో వచ్చే సూచనలను అనుసరించాలని సూచించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement