
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్‌ను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్‌ను ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లోనే నిర్వహిస్తున్నారు.
2021 నుంచి భారత్‌లోని పలు ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించాలని జేఏబీ నిర్ణయించిందని మంత్రి గురువారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విద్యా విధానం దిశగా మరిన్ని నిర్ణయాలకు ఇది దారితీయనుంది. ఇక భారత్‌లో వైద్య విద్య ప్రవేశ పరీక్షల నీట్‌ను మాత్రమే 11 భాషల్లో నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment