ఏప్రిల్‌ 16 నుంచి జేఈఈ మెయిన్స్‌ | Hyderabad: JEE Main First Phase From April 16 To 21 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 16 నుంచి జేఈఈ మెయిన్స్‌

Published Wed, Mar 2 2022 3:05 AM | Last Updated on Wed, Mar 2 2022 3:05 AM

Hyderabad: JEE Main First Phase From April 16 To 21 - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: జాతీయస్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీలు, ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్‌) నోటిఫికేషన్‌ మంగళవారం విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఈ పరీక్షను రెండు దఫాలుగా నిర్వహిస్తోంది. మొదటిదఫా పరీక్ష ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకూ, రెండో దఫా పరీక్ష మే 24 నుంచి 29 వరకూ ఉంటుంది.

పరీక్ష నెగెటివ్‌ మార్కులతో ఆన్‌లైన్‌ ద్వారానే చేపడతారు. అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన ఫీజు కూడా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. పేపర్‌–1 (బీఈ, బీటెక్‌ విద్యార్థులకు) మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమెస్ట్రీ పేపర్లతో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ మొదటి షిఫ్ట్, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకూ రెండో షిఫ్ట్‌ ఉంటుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది.

పేపర్‌–2 (బీఆర్క్‌ విద్యార్థులకు) మేథ్స్, ఆప్టిట్యూట్‌ టెస్ట్, డ్రాయింగ్‌ టెస్ట్‌ ఉంటుందని తెలిపింది. ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు ఉంటుందని పేర్కొంది. పేపర్‌–2 బి (బీ ప్లానింగ్‌ విద్యార్థులకు) ఆప్టిట్యూట్‌ టెస్ట్, ప్లానింగ్‌పై మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. పూర్తి వివరాలు, బ్రోచర్‌ ్జ్ఛ్ఛఝ్చజీn.n్ట్చ.nజీఛి.జీn వెబ్‌సైట్‌లో లభిస్తాయని ఎన్‌టీఏ తెలిపింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement