- పేర్లలో తప్పులుంటే ఇంటర్ బోర్డుల ద్వారా సరిదిద్దుంచుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశానికి సంబంధించి ఏప్రిల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌కు (జేఈఈ మెయిన్-2016) సంబంధించి ఇ-అడ్మిట్‌కార్డులను సెంట్రల్‌బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సిద్ధం చేసింది. ఇప్పటికే ఫీజులు చెల్లించిన అభ్యర్ధుల ఇ-అడ్మిట్ కార్డులను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జేఈఈమెయిన్.ఎన్‌ఐసీ.ఇన్’’ వెబ్‌సైట్‌లోకి సీబీఎస్‌ఈ అప్‌లోడ్ చేసింది. ఆయా అభ్యర్ధులు తమ, బోర్డుల సమాచారాన్ని అప్‌లోడ్ చేసి ఈ ఇ-అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఇ-అడ్మిట్‌కార్డుల్లో అభ్యర్ధుల పేర్లలో ఏమైనా తప్పులు దొర్లితే అభ్యర్ధులు బోర్డులో ఏపేరు ఉంటే అదే మాదిరిగా జేఈఈ వెబ్‌సైట్లోకి అప్‌లోడ్ చేసి ఇ-అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆతదుపరి బోర్డుల ద్వారా పేర్లలోని తప్పులను సరిచేయించుకోవాలి. బోర్డులు ఆయా అభ్యర్ధుల సమాచారాన్ని పంపినప్పుడు జేఈఈ డేటాలోకి వాటిని అప్‌లోడ్ చేస్తారు. కనుక అభ్యర్ధులు వెంటనే ఇ-అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకొని తప్పులుంటే బోర్డుల ద్వారా సరిచేయించుకోవాలి. ఇ-అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ కానిపక్షంలో అభ్యర్ధులు సీబీఎస్‌ఈ హెల్ప్‌లైన్లు 7042399520, 521, 524, 525, 526, 528లలో ఉదయం పదినుంచి సాయంతరం అయిదున్నరలోపు సంప్రదించాలని సీబీఎస్‌ఈ పేర్కొంది.
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు సిద్ధం
Published Tue, Mar 29 2016 11:24 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
Advertisement
Advertisement