నేటి నుంచి జేఈఈ మెయిన్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీలతోపాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వ హించే జేఈఈ మెయిన్- 2017 దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) దృష్టి సారిం చింది. దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన ఇన్ఫర్మే షన్ బ్రోచర్‌ను బుధవారం అర్ధరాత్రి తరువాత లేదా గురువారం ఉదయం జేఈఈ మెయిన్ వెబ్ సైట్(jeemain.nic.in)లో అందు బాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి జనవరి 2 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకో వచ్చు.
పరీక్ష ఫీజును జనవరి 3 వరకు చెల్లించ వచ్చు. ఇక ఈసారి జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఆధార్ సహాయక కేంద్రా లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని హైదరా బాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తా మని ప్రకటించింది. ఇంకా ఆధార్ తీసుకోనివారు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సహాయక కేంద్రా ల్లో సంప్రదించి ఆధార్‌కు ఎన్ రోల్ చేసుకోవచ్చు. ఆ ఎన్‌రోల్ మెంట్ నంబర్‌తో జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఏదైనా సహాయక కేంద్రంలో ఆధార్ నమోదుకు అవకాశం లేకపోతే వారు ఇచ్చే రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడా జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. సహాయక కేంద్రాల వివరాలను వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
ఐఐటీల్లో విదేశీ విద్యార్థుల ఫీజు 6లక్షలు
ఐఐటీల్లో చేరే విదేశీ విద్యార్థులకు ఫీజును ఐఐటీ కౌన్సిల్ నిర్ణరుుంచినట్లు తెలిసింది. మన దేశ విద్యార్థులకు ఫీజును ఇటీవలే రూ.90 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచిన ఐఐటీ కౌన్సిల్, విదేశీ విద్యార్థుల నుంచి వసూలు చేసే వార్షిక ఫీజును రూ.6 లక్షలుగా నిర్ణరుుంచింది.