IIT council
-
ఇక ఐఐటీల్లోనూ ఆన్లైన్ పాఠాలు!
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీల్లో ఆన్లైన్లో తరగతులను నిర్వహించేందుకు ఐఐటీ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్డ్, కౌన్సెలింగ్ అనంతరం సెప్టెంబర్ ఆఖరు లేదా అక్టోబర్‌లో తరగతులు ప్రారంభమయ్యే వీలుంది. ఇక ఇతర సెమిస్టర్ విద్యార్థులకు తరగతులను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్ తరగతులను నిర్వహించేందుకు ఐఐటీల కౌన్సిల్ కసరత్తు ప్రారంభించింది. ఒక సెమిస్టర్ పాటు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కసరత్తు చేస్తోంది. అప్పటికీ కరోనా అదుపులోకి రాకపోతే ఈ ఏడాది చివరి వరకు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఇందుకు ఐఐటీల కౌన్సిల్ గతవారం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. -
మే 19న జేఈఈ అడ్వాన్స్డ్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం 2019 మే 19న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించాలని ఐఐటీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్ష నిర్వహణ బాధ్యతను ఐఐటీ రూర్కీకి అప్పగించింది. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కోసం వెబ్‌సైట్‌ను ( jeeadv. ac. in) అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుల స్వీరణ, పరీక్ష ఫీజు తదితర పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ను త్వరలోనే జారీ చేస్తామని పేర్కొంది. ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్‌ను రెండుసార్లు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దఫా పరీక్షలను 2019 జనవరి 6 నుంచి 20 వరకు ఆన్లైన్లో నిర్వహించనుంది. వాటి ఫలితాలను అదే నెల 31 నాటికి వెల్లడించనుంది. రెండో దఫా పరీక్షలను 2019 ఏప్రిల్ 6 నుంచి 20 వరకు నిర్వహించి ఫలితాలను ఏప్రిల్ 30 నాటికి విడుదల చేయనుంది. మొత్తానికి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులను మే 1 నుంచి ప్రారంభించనుంది. రెండు దఫాల్లో జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకోనుంది. వారి నుంచి దరఖాస్తులను స్వీకరించిన అనంతరం మే 19న పరీక్ష నిర్వహించనుంది. అందులో పేపర్–1, పేపర్–2కు హాజరైన అభ్యర్థులకే ర్యాంకులను ఇవ్వనుంది. వాటి ఆధారంగా జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలతోపాటు ఐఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఈ నెలాఖరులోగా జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల షెడ్యూల్‌తోపాటు ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీ షెడ్యూల్ విడుదల కానుంది. గతేడాది దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు 2.24 లక్షల మంది అర్హత సాధించారు. జేఈఈ మెయిన్‌లో టాప్ మార్కులు సాధించిన 2.24 లక్షల మందిలో 1.68 లక్షల మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే అభ్యర్థుల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లో ఆ వివరాలను వెల్లడించనుంది. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలతోపాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వ హించే జేఈఈ మెయిన్- 2017 దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) దృష్టి సారిం చింది. దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన ఇన్ఫర్మే షన్ బ్రోచర్‌ను బుధవారం అర్ధరాత్రి తరువాత లేదా గురువారం ఉదయం జేఈఈ మెయిన్ వెబ్ సైట్(jeemain.nic.in)లో అందు బాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి జనవరి 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వచ్చు. పరీక్ష ఫీజును జనవరి 3 వరకు చెల్లించ వచ్చు. ఇక ఈసారి జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఆధార్ సహాయక కేంద్రా లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని హైదరా బాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తా మని ప్రకటించింది. ఇంకా ఆధార్ తీసుకోనివారు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సహాయక కేంద్రా ల్లో సంప్రదించి ఆధార్‌కు ఎన్ రోల్ చేసుకోవచ్చు. ఆ ఎన్రోల్ మెంట్ నంబర్‌తో జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఏదైనా సహాయక కేంద్రంలో ఆధార్ నమోదుకు అవకాశం లేకపోతే వారు ఇచ్చే రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడా జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. సహాయక కేంద్రాల వివరాలను వెబ్సైట్లో పొందవచ్చు. ఐఐటీల్లో విదేశీ విద్యార్థుల ఫీజు 6లక్షలు ఐఐటీల్లో చేరే విదేశీ విద్యార్థులకు ఫీజును ఐఐటీ కౌన్సిల్ నిర్ణరుుంచినట్లు తెలిసింది. మన దేశ విద్యార్థులకు ఫీజును ఇటీవలే రూ.90 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచిన ఐఐటీ కౌన్సిల్, విదేశీ విద్యార్థుల నుంచి వసూలు చేసే వార్షిక ఫీజును రూ.6 లక్షలుగా నిర్ణరుుంచింది. -
రాష్ట్రంలో 3 కేంద్రాల్లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
- పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు - ఈసారి ఆలస్య రుసుముతోనూ చెల్లించే అవకాశం సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫీజులు పెరిగాయి. ఐఐటీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మేరకు పెంచిన ఫీజులు, ఇతర వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌ను ముంబై ఐఐటీ శుక్రవారం వెబ్సైట్ jeeadv.ac.in అందుబాటులో ఉంచింది. జనరల్ అభ్యర్థులకు ఫీజును రూ.2,000 నుంచి రూ.2,400కు... మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.1,000 నుంచి రూ.1,200కు పెంచింది. అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ 28 నుంచి మే 2 వరకు చేపడతామని పేర్కొంది. ఇంతకుముందు నిర్ణీత గడువు తర్వాత రిజిస్ట్రేషన్‌కు అవకాశమే లేకపోగా... ఈసారి ఆలస్య రుసుముతో మరో 2 రోజులు రిజిస్ట్రేషన్‌కు వెసులుబాటు కల్పించింది. రూ.500 రుసుముతో మే 3 ఉదయం 10 నుంచి 4వ తేదీ సాయంత్రం 5 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పరీక్షను మే 21న రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో.. ఏపీలోని నెల్లూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపింది. విదేశాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఈసారి కొత్తగా సార్క్ దేశాల్లోనూ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ముంబై ఐఐటీ వెల్లడించింది. అక్కడ 135 డాలర్లు ఫీజుగా చెల్లించాలని.. ఆలస్యమైతే అదనంగా 80 డాలర్లు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించింది. సార్క్ దేశాలు మినహా ఇతర దేశాల్లోని విద్యార్థులు 270 డాలర్లు ఫీజు చెల్లించాలని (గతంలో ఒక్క దుబాయ్ కేంద్రమే ఉండేది. అక్కడి వారు 220 డాలర్లు చెల్లించాలి).. నిర్ణీత గడువు దాటితే అదనంగా 80 డాలర్లు ఆలస్య రుసుము చెల్లించాలని తెలిపింది. ఎన్నారైలకు ప్రతి బ్రాంచీలో 10% సీట్లను కేటాయిస్తామని పేర్కొంది. అంధులు, డిస్లెక్సియా తో బాధపడే వారు సహాయకులను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీనికై వారు జోనల్ ఐఐటీలో ఉండే జేఈఈ అడ్వాన్స్డ్ చైర్మన్‌కు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయాలని సూచించింది. వారికి పరీక్ష నిర్ణీత సమయం కంటే అదనంగా మరో గంట సమయం ఇస్తారని తెలిపింది. ఓబీసీ నాన్ క్రిమీలేయర్ విద్యార్థులు 2017 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిన ఓబీసీ నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్లను అందజేస్తేనే ఆ కేటగిరీ రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్!
ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్.. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ రాత పరీక్షను 2017-18 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ 2న నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జారీ చేసే అవకాశముంది. ఇందుకోసం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ మొదటి ఆదివారం (2న) జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ పరీక్షను నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత నాలుగైదు రోజులకు ఆన్లైన్ పరీక్షలు వరుసగా నాలుగు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా, మే 21న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తామని ఇటీవల ఐఐటీల కౌన్సిల్ స్పష్టం చేసిన నేపథ్యంలో జేఈఈ మెయిన్ ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలోనే ప్రకటించేందుకు సీబీఎస్ఈ కసరత్తు చేస్తోంది. ఫలితాలు వెల్లడించిన రోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది.