సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జేఈఈ మెయిన్ నిర్వహించే పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పెంచింది. జనవరిలో జరిగిన మొదటి దఫా జేఈఈ మెయిన్ పరీక్షను 7 పట్టణాల్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా, ఏప్రిల్‌లో నిర్వహిం చనున్న రెండో దఫా జేఈఈ మెయిన్ పరీక్షను 9 పట్టణాల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. జనవరిలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ పట్టణాల్లో పరీక్షలను నిర్వహించిన ఎన్‌టీఏ ఏప్రిల్‌లో వాటితోపాటు అదనంగా కోదాడ, నిజామాబాద్‌లోనూ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు ఎన్‌టీఏ 2 దఫాలుగా జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దఫా పరీక్షల ఫలితాలను ఇటీవల వెల్లడించింది.
ఇక ఏప్రిల్ 7 నుంచి 20 మధ్య నిర్వహించే రెండో దఫా జేఈఈ మెయిన్ దరఖాస్తులను శుక్రవారం ప్రారంభించింది. వచ్చే నెల 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సబ్మిషన్‌కు, 8 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపునకు చర్యలు చేపట్టింది. ఇక ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేయనుంది. జనవరిలో జరిగిన పరీక్షతోపాటు, ఏప్రిల్‌లో జరిగే పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎందు లో ఎక్కువ స్కోర్ లభిస్తే దానిని పరిగణనలోకి తీసుకొని ఆ తర్వాత తుది ర్యాంకులను ప్రకటించనుంది. ఆ ర్యాంకుల ఆధారంగా ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశా లు చేపట్టనుంది. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వ హించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా జేఈ ఈ మెయిన్‌లో టాప్ పర్సంటైల్ (స్కోర్) సాధించిన 2.24 లక్షల మంది అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోనుంది. జేఈఈ మెయి న్ ఫలితాలు వెల్లడైన మరుసటిరోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తుల ప్రక్రి యను ఐఐటీ రూర్కీ చేపట్టనుంది. ఆ పరీక్షను మే 19న నిర్వహించనుంది.
ఏప్రిల్‌లోనూ నాలుగు రోజులే!
జనవరిలో జేఈఈ మెయిన్‌ను 4 రోజుల పాటు ప్రతి రోజు 2 షిఫ్ట్‌లలో నిర్వహించిన ఎన్‌టీఏ ఏప్రిల్‌లోనూ 4 రోజుల పాటు ప్రతి రోజు 2 షిఫ్ట్‌లలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించనుంది. మొదటి దఫా పరీక్షలకు హాజ రుకాని 60 వేల మంది విద్యార్థులు రెండో దఫా పరీక్షకు హాజరుకానున్నారు. వారితోపాటు మొదటి దఫా పరీక్షలకు హాజరైన వారిలోనూ 99% మంది తమ స్కోర్‌ను పెంచుకునేందుకు రెండో దఫా పరీక్షకు హాజరుకానున్నారు. కొంతమంది కొత్త విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో జరిగే పరీక్షకు 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది.
ఇదీ పరీక్ష షెడ్యూల్..
ఆన్‌లైన్‌లో పరీక్షలను ప్రతి రోజు 2 షిఫ్ట్‌లుగా నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి షిఫ్ట్ పరీక్ష నిర్వహించనుండగా, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో షిఫ్ట్ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సి ఉంది. ఉదయం పరీక్షకు 8:30లోపు, మధ్యాహ్నం పరీక్షకు 1:30లోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనుంది. పరీక్ష హాల్లోకి ఉదయం పరీక్షకు 8:45 గంటల నుంచి 9 వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1:45 నుంచి 2 వరకు అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment