ఫేస్‌ బుక్‌ స్నేహం లైంగిక దాడికి దారితీసింది | Sexual Assult On Facebook Friend | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై లైంగిక దాడి

Published Tue, Nov 28 2017 10:25 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Sexual Assult On Facebook Friend - Sakshi

సాక్షి, చెన్నై : ఫేస్‌ బుక్‌ స్నేహం ఓ విద్యార్థినిపై లైంగికదాడికి దారితీసింది. ప్రేమ పేరుతో లొంగదీసుకుని, ఆమెతో గడిపిన క్షణాల్ని వీడియో చిత్రీకరించడామే కాకుండా తన స్నేహితుడితో కలిసి కొంత కాలంగా లైంగిక దాడులకు పాల్పడుతూ వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకరిని చెన్నై పోలీసులు సోమవారం అరెస్టుచేశారు.  చెన్నైషావుకారు పేటకు చెందిన మోని(21), రవీంద్ర శర్మ(24) మిత్రులు. బ్రాడ్‌వేకు చెందిన ఓ సంపన్న ఇంటి విద్యార్థినిని ఫేస్‌బుక్‌లో మోని ట్రాప్‌ చేశాడు. బర్త్‌డే అంటూ లాడ్జీకి తీసుకెళ్లి  ప్రేమపేరుతో లొంగదీసుకున్నాడు. ఆ క్షణాల్ని రహస్యంగా వీడియో చిత్రీకరించిన మోని, దానిని అడ్డం పెట్టుకుని తనకు అవసరమైనప్పడుల్లా ఆ విద్యార్థినిని లాడ్జికి రప్పించుకోవడం మొదలెట్టాడు. తన స్నేహితుడు రవీంద్ర శర్మతో కలిసి లైంగిక దాడి చేయడమే కాకుండా, ఆమె వద్ద రూ.లక్షన్నర వరకు గుంజుకున్నారు.

ఈ ఇద్దరి వేధింపులు రోజురోజుకూ పెరగడంతో ఆ విద్యార్థిని మానసికంగా కుంగిపోయింది. రూ.రెండు లక్షలు కావాలని ఒత్తిడి తీసుకురావడంతో గత్యంతర లేక కుటుంబీకుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బ్రాడ్‌ వే మహిళా పోలీసులు రంగంలోకి దిగారు. పథకం ప్రకారం రవీంద్ర శర్మను అరెస్టుచేశారు. మోనీ అజ్ఞాతంలోకి వెళ్లడంతో అతనికోసం గాలిస్తున్నారు. కాగా, ఆ విద్యార్థినిని నాలుగు సంవత్సరాలు కష్టపడి మోనీ ట్రాప్‌చేశాడని, ఏడాదిన్నర కాలానికి పైగా తాము ఆమెమీద లైంగికదాడికి పాల్పడినట్టు రవీంద్ర శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement