ర్యాగింగ్‌పై ఉక్కుపాదం
Published Sun, Aug 4 2013 5:30 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
కళాశాలల్లో ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విద్యార్థులతోనే ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కమిటీ సోమవారం సమావేశం కానుంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: కళాశాల జీవితం ప్రతి విద్యార్థికీ కీలకం. ఎన్నో కలలతో, లక్ష్యాలతో విద్యార్థులు కళాశాలలకు వస్తుంటారు. అరుుతే ర్యాగింగ్ భూతం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా కళాశాల జీవితంలోకి అడుగుపెట్టే విద్యార్థులను సీనియర్లు చిన్నపాటి అల్లరి చేష్టలతో సరదాగా ఆట పట్టించడం ర్యాగింగ్‌గా ముద్రపడింది. ఈ సరదా కొన్ని సమయూల్లో శ్రుతి మించుతోంది. అసంబద్ధ, అసభ్యకరమైన ప్రశ్నలేగాక, దుస్తులను విప్పించడం వంటి చేష్టలకూ కొందరు సీనియర్లు వెనకాడడం లేదు. ర్యాగింగ్ విషయంలో విద్యార్థినులూ తక్కువేం కాదు. ర్యాగింగ్ భూతం దెబ్బతో ఇటీవలే చెన్నైలో ఓ విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్ మిద్దెపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ర్యాగింగ్‌ను కొందరు సరదాగా తీసుకుంటున్నారు. సున్నితమనస్కులైన విద్యార్థులు మాత్రం బెదిరిపోతున్నారు. మరికొందరు అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ర్యాగింగ్‌తో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వాలు దృష్టి సారించారుు. అస్సోంలో 1988 డిసెంబరు 17న ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీల్లో దీనిని అమలు చేయడం ప్రారంభించారు.
కలెక్టర్ నేతృత్వంలో కమిటీ
తమిళనాడులోని అన్ని కళాశాలలు, యూని వర్సిటీల్లో ఈ నెల 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యూరుు. దేశం నలుమూలల నుంచి వచ్చి విద్యార్థులు ఇక్కడ చేరారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నై కలెక్టర్ సుందరవల్లి నేతృత్వంలో ర్యాగింగ్ నిరోధక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో జిల్లా రెవెన్యూ అధికారి, నగర కమిషనర్, మీడియా ప్రతినిధులు, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడికల్, సాంస్కృతిక కళాశాలల విద్యార్థులను సభ్యులుగా చేర్చారు. ర్యాగింగ్ బాధితుల సౌకర్యార్థం 1077 నెంబర్‌తో టోల్ ఫ్రీ ఫోన్ ఏర్పాటు చేశారు.
కమిటీ సభ్యులతో ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ సమావేశం కానున్నారు. కళాశాలల్లో ర్యాగింగ్‌ను అదుపుచేసే బాధ్యతను విద్యార్థులకు అప్పగించడం, ఆపైన అధికారుల పర్యవేక్షణగా నిర్ణయించడం విశేషం.
Advertisement
Advertisement