మహిళా పోలీసు కానిస్టేబుల్పై కిరాతకం | Tamil Nadu: Woman police constable injured in acid attack at Tiruppattur | Sakshi
Sakshi News home page

మహిళా పోలీసు కానిస్టేబుల్పై కిరాతకం

Published Sat, Dec 24 2016 9:17 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

మహిళా పోలీసు కానిస్టేబుల్పై కిరాతకం - Sakshi

మహిళా పోలీసు కానిస్టేబుల్పై కిరాతకం

వెల్లూరు : సాధారణ స్త్రీలకే కాక, మహిళా పోలీసు కానిస్టేబుళ్లకు సైతం దేశంలో భద్రత కరువైంది. వెల్లూరు జిల్లా తిరుప్పతూర్లో ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్పై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేసి కిరాతకానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. లావణ్య అనే పోలీసు కానిస్టేబుల్, రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కొందరు గుర్తుతెలియని దుండగులు ఆమెపై యాసిడ్ దాడి చేశారు. లావణ్యకు, తన భర్తకు గత కొంతకాలంగా గొడవలు ఉండటంతో, ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది.
 
శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. చికిత్స నిమిత్తం లావణ్యను వెంటనే వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. లావణ్య ముఖం, చేతులు యాసిడ్ దాడితో తీవ్రంగా గాయపడ్డాయని పోలీసులు చెప్పారు. ఈ దాడికి పాల్పడ్డ వారిని కనుగొనేందుకు వెంటనే దర్యాప్తు ప్రారంభించామని అధికారులు పేర్కొన్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement