వేలూరు: వేలూరు సత్‌వచ్చారిలోని ఇద్దరు పాఠశాల విద్యార్థులు కిడ్నాప్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళితే... రంగాపురానికి చెందిన ట్రావెల్స్ యజమాని మురుగేషన్ కుమారుడు జగదీశన్, గాంధీనగర్‌కు చెందిన జాన్‌బాషా కుమారుడు మహ్మద్ అజీష్ వీరిద్దరూ గాంధీనగర్‌లోని ప్రవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. దీంతో వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. పాఠశాల పూర్తి చేసుకొని మహ్మద్ అజీష్ మాత్రం ఇంటికి వెళ్లేవాడు, జగదీశన్ ట్యూషన్‌కు వెళ్లేవాడు.
ఈ నేపథ్యంలో మహ్మద్ అజీష్ శుక్రవారం సాయంత్రం రాత్రి 8 గంటల వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అజీష్ కోసం పాఠశాలకు వెళ్లారు. తరగతి ముగిసిన వెంటనే అజీష్ ఇంటికి వెళ్లినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ట్యూషన్‌కు వెళ్లిన జగదీశన్ కూడా ఇంటికి రాక పోవడంతో ఇద్దరు తల్లిదండ్రులు వారి పిల్లలు కనిపించలేదని రాత్రి పూర్తిగా కుమారులను వెతకసాగారు. శనివారం మద్యాహ్నం 2 గంటల సమయంలో ఇద్దరు విద్యార్థుల నుంచి ఒక సెల్ నెంబర్‌కు ఫోన్‌కాల్ వచ్చింది.
పాఠశాల ను ంచి బయటకు వచ్చిన ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు ఆ టోలో తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. ఆర్కాడు మణిగుండు వద్ద త మను దించి వేసి గుర్తు తెలియని వ్యక్తులు ఆటోను తీసుకెళ్లినట్లు తె లిపారు. దీంతో తల్లి దండ్రులు ఆర్కాడుకు వెళ్లి విద్యార్థులను పట్టుకున్నారు. సత్‌వాచ్చారి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఫిర్యాదు చేశారు. దీ ంతో పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థులను విచారిస్తున్నారు.
ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్
Published Sun, Oct 9 2016 2:04 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
Advertisement
Advertisement